Today Narayankhed bipoll results

Today narayankhed bipoll results

narayankhed, Narayankhed Bypolls, Bypolls, TRS, harish Rao

All parties took prestigious Narayankhed bypolls. harish Rao champaigned heavily in the Narayankhed.

నారాయణ్ ఖేడ్ ఫలితాలు నేడే

Posted: 02/16/2016 08:16 AM IST
Today narayankhed bipoll results

హోరాహోరీగా సాగిన నారాయణఖేడ్ లో గెలుపు ఎవరిని వరిచింది అన్నది నేడు తేలనుంది. గత 13న జరిగిన పోలింగ్‌కు సంబంధించి నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారులోగల పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఎలువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 144సెక్షన్ విధించి పట్టణంలో పోలీసు పహారాను ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకే తుది ఫలితం వెలువడే అవకాశముంది.

ఎమ్యెల్యే పి.కిష్టారెడ్డి మృతితో నారాయణఖేడ్ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు నేటితొ తెరపడనుంది. అందరి చూపు ప్రస్తుతం నారాయణఖేడ్ వైపు ఉండగా స్థానిక రాజకీయ చరిత్రలోనే కీలకమైనవిగా భావిస్తున్న ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. మంత్రి హరీశ్‌ రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్ అభివృద్ధి నినాదంతో ప్రజల ముందుకు వెళ్లగా, దివంగత ఎమ్యెల్యే పి.కిష్టారెడ్డి చేసిన సేవలే ప్రచారాస్ర్తాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. ప్రధానంగా ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది. కాగా మిగిలిన బిజెపిటిడిపి ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ కూడా కేవలం నామమాత్రపు ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నది వాస్తవం. కాగా తన మామ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టిన రోజు కానుకగా నారాయణ ఖేడ్ ను ఇస్తానని మంత్రి హరీశ్ రావు గతంలో ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narayankhed  Narayankhed Bypolls  Bypolls  TRS  harish Rao  

Other Articles