Fire Accident During Cultural Programme in Make In India Week

Fire accident during cultural programme in make in india week

Make in India, Mumbai, Fire accident

A major fire broke out on the stage during a cultural programme at the 'Make in India Week' at Girgaum Chowpatty on Sunday evening. “Fire is fully under control,” the official spokesperson of Mumbai police DCP Detection Dhananjay Kulkarni said.

ITEMVIDEOS: మేక్ ఇన్ ఇండియా వారోత్సవాల్లో అగ్ని ప్రమాదం

Posted: 02/15/2016 08:54 AM IST
Fire accident during cultural programme in make in india week

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా  వారోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. మేక్ ఇన్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది.  మంటల్లో  సాంస్కృతిక కార్యక్రమాల  వేదిక దగ్ధమైంది. పలువురు కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అగ్నిమాపకదళం మంటలను ఆర్పివేస్తోంది.  ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న గిర్ గౌమ్ చౌపాటీ ప్రాంతంలో  అగ్నిప్రమాదం జరిగిన వెంటనే.. అక్కడ ఉన్నవారందరినీ ఖాళీ చేయించారు. శనివారంనాడే ప్రధాని నరేంద్రమోదీ  మేక్ ఇన్ ఇండియా  వారోత్సవాలను  ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Make in India  Mumbai  Fire accident  

Other Articles