Chirala MLA arrested for disrupting peace

Chirala mla arrested for disrupting peace

Chirala, MLA Amanchi Krishna Mohan, Guntur Police, Police

The police arrested Chirala MLA Amanchi Krishna Mohan and few others on Thursday evening at Chirala on the charges of obstructing peace in society. It may be recalled here that Amanchi was supporting the family of Boppana Purnachandra Rao, who died in police custody on Wednesday

చీరాల ఎమ్మెల్యే అరెస్ట్

Posted: 02/12/2016 11:01 AM IST
Chirala mla arrested for disrupting peace

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తారన్న ఆరోపణలతో ముందుస్తు జాగ్రత్తగా ఆమంచిని అరెస్టు చేశారు. కాగా అంతకు ముందు పోలీస్ కస్టడీలో ఓ వ్యక్తి చనిపోవడం మీద గత కొంత కాలంగా ఆమంచి కృష్ణమోహన్ నిరసన, ఆందోళన చేస్తున్నారు. అయితే పోలీసుల వేదింపుల వల్లే పూర్ణచందర్ రావు అనే వ్యక్తి చనిపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అయితే కేవలం అనారోగ్యం కారణంగానే పూర్ణచందర్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే పూర్ణచందర్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆమంచి కృష్ణమోహన్ ఆందోళన కోసం చీరాలకు వస్తుండగా.. మధ్యలోనే ఆపి అతడిని అరెస్టు చేశారు.

కాగా వివాదానికి కారణమైన పూర్ణచందర్ రావు శవాన్ని రిమ్స్ కు తరలించారు. మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపించాలని గుంటూరు ఐజీ సంజయ్ కావలి డిఎస్పీ ఎస్. రాఘవరావును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించారు. శవానికి పోస్టు మార్టం పూర్తైన తర్వాత పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అయితే శవంతోనే రోడ్డు మీద బైఠాయించాలని ఎమ్మెల్యే ఆమంచి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆమంచితో పాటుగా దాదాపుగా 200 మంది ఆమంచి అనుచరులను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అరెస్ట్ తో చీరాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chirala  MLA Amanchi Krishna Mohan  Guntur Police  Police  

Other Articles