Party will tide over crisis, says N Chandrababu Naidu

Party will tide over crisis says n chandrababu naidu

TDP, TTDP, Chandrababu Naidu, TRS, Telangana

TDP president N Chandrababu Naidu today said his party would overcome the crisis in the wake of its floor leader in Legislative Assembly and an MLA crossing over to ruling TRS in Telangana. Recalling that TDP has faced several crisis in its 34-year history, Naidu told an extended meeting of the party’s Telangana unit here that workers are the real strength of TDP. TDP faced a lot of problems when it was in opposition for 10 years. The party would not be weakened with a few leaders deserting it, he said.

ITEMVIDEOS: పార్టీ బలంగా ఉంది: చంద్రబాబు నాయుడు

Posted: 02/12/2016 08:56 AM IST
Party will tide over crisis says n chandrababu naidu

తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసపెట్టి కార్యకర్తలు సైకిల్ ను వీడి.. కారెక్కుతున్నారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు చర్యలకు పూనుకున్నారు. కార్యకర్తల్లో మనోదైర్ఘ్యాన్ని నింపేందుకు నిన్న విసృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు పోయినా పార్టీ పోదని ఆయన అన్నారు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదంటూ శ్రేణుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణాలో పార్టీ ఎమ్మెల్యేల వలసల నేపథ్యంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టీటీడీపీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతీ విషయంలో నేతల సలహాలు, సూచనల ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

పార్టీ నుంచి నేతలు వలసపోతున్నా పార్టీ ఇప్పటికీ బలంగానే ఉందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టీడీపీ బలం కార్యకర్తలే అన్నారు చంద్రబాబు. క్యాడర్ ఉన్నంతవరకు పార్టీ ఉంటుందన్న ఆయన జాతీయ స్థాయిలో టీడీపీ ఎదుర్కొన్నన్ని సంక్షోభాలు మరే పార్టీ ఎదుర్కోలేదన్నారు. పార్టీని ఎందరు నాయకులు వీడినా వచ్చే నష్టం లేదన్నారు. 1985 బీజేపీకి ఇద్దరే ఎంపీలున్నా ఆ తర్వాత అదే పార్టీ కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. నాయకత్వాన్ని పెంచుకుందామని, కార్యకర్తల బలాన్ని పెంచుకుందామన్నారు చంద్రబాబు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నప్పుడే నాయకత్వ ప్రతిభ బయటపడుతుందన్నారు. టిడిపికి ఉన్నది కార్యకర్తల బలమేనని స్పష్టం చేశారు. ఎలాంటి సంక్షోభాన్నయినా అవకాశంగా తీసుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  TTDP  Chandrababu Naidu  TRS  Telangana  

Other Articles