ఎట్టకేలకు కాపులకు రిజర్వేషన్ల విషయంలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. గంటన్నరకు పైగా ముద్రగడతో ప్రభుత్వ ప్రతినిధులుగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావులు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలమయ్యాయి.
గడువు విధించి దీక్ష విరమించిన ముద్రగడ. నిమ్మరసం ఇచ్చి ముద్రగడ దీక్ష విరమించిన కళా వెంకట్రావు. ముద్రగడ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ముద్రగడ ముందు ప్రభుత్వ ప్రతినిధులు ముందు మూడు ప్రతిపాదనలను వుంచారు. అందులో మొదటిది జస్టిస్ మంజునాధ్ కమీషన్ కు నిర్దిష్ట కాలపరిమితి. రెండవది కాపు కమీషన్ లో ముద్రగడ సూచించిన ఒకరికి స్థానం కల్పించడం. మూడవది కాపు కార్పోరేషన్ కమీషన్ కు రుణాలిచ్చేలా హామీ ఇవ్వడం. ఈ మూడు ప్రతిపాదనలకు ముద్రగడ అంగీకరించి దీక్ష విరమించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more