Krishna Pushkaralu | Telangana | KCR | News

Krishna pushkaralu in telangana

Krishna Pushkaralu in Telangana, T CM talk about Krishna Pushkaralu, KCR talks about Krishna Pushkaralu, Krishna Pushkaralu, KCR Krishna Pushkaralu, KCR, Telangana news

Krishna Pushkaralu in Telangana: Telangana CM KCR meets with officers about Krishna Pushkaralu in Telangana.

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలు

Posted: 02/08/2016 09:01 AM IST
Krishna pushkaralu in telangana

తెలంగాణ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరింతగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. గోదావరి పుష్కరాల తరహాలోనే తెలంగాణలో కృష్ణా పుష్కరాలను నిర్వహించి, తెలంగాణ ఖ్యాతిని, గౌరవాన్ని పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది ఆగస్టులో మంచివర్షాలు కురిసే సమయంలో పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో భౌగోళిక, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంపై సచివాలయంలో కృష్ణా పుష్కరాలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 50 వరకు స్నానఘట్టాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలు జరిగిన సమయం, ప్రదేశాలతో పోలిస్తే కృష్ణా పుష్కరాలు చాలా భిన్నమైనవని, చాలా జాగ్రత్తలు అవసరమని సూచించారు.

కృష్ణానదితీరంలోని జోగులాంబ దేవస్థానం అష్టాదశ శక్తిపీఠాల్లో ఘనమైనదని, ఈ దేవస్థానాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, దేవస్థానం వరకు చక్కని రహదారులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కృష్ణానదీతీరం వరకు రాకపోకల సౌకర్యాలు సరిగ్గా లేనందున, తీరంవరకు వెళ్లడానికి, అక్కడినుంచి రావడానికి వేర్వేరు దారులు ఏర్పాటుచేయాలని అన్నారు.

అలాగే వాహనాలకు ఇబ్బందులు ఏర్పడకుండా, గట్టినేలలో పార్కింగ్‌స్థలాలు, హోర్డింగ్‌స్పేస్‌లు ఏర్పాటుచేయాలని తెలిపారు. కృష్ణానదిలో మొసళ్లు ఉంటాయని, ఆ దిశలో జాగ్రత్తలు అవసరమని చెప్పారు. జోగులాంబ దేవస్థానంతోపాటు పుష్కరఘాట్లకు వెళ్లేమార్గంలో ఉండే అన్నీ దేవాలయాలను గుర్తించి ఆధునీకరించాలని సీఎం మార్గనిర్ధేశం చేశారు. పుష్కరస్నానం చేసిన తర్వాత క్షేత్రదర్శనం సంప్రదాయమని, ఆలయాల వద్ద సదుపాయాలను పెంపొందించాలని అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Pushkaralu  KCR  Telangana  News  KTR  

Other Articles