Danam Nagender resigned for Greater hyderabad President

Danam nagender resigned for greater hyderabad president

Danam nagender, Danam, Hyderabad, GHMC, Congress

Danam Nagender resigned for Greater hyderabad President Danam Said that Hyderabad people decided to vote for TRS and KCR

గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా

Posted: 02/06/2016 12:48 PM IST
Danam nagender resigned for greater hyderabad president

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ ప్రకటించారు. తన రాజీనామాను నిన్న పీసీసీకి, దిగ్విజయ్ సింగ్కు పంపుతున్నట్లు చెప్పారు. ప్రజలు తమను విశ్వసించలేదని, టీఆర్ఎస్ ను బాగా విశ్వసించారని చెప్పారు. ఇంత పెద్ద మాండేట్ రావడం కనీ వినీ ఎరుగమని ఆయన అన్నారు. ప్రజలు వాళ్లను, వాళ్లు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను నమ్మారన్నారు. టీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలో చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉచిత కరెంటు, నీటి బిల్లుల మాఫీ, 24 గంటల కరెంటు, హైదరాబాద్ నలుమూలలా ఆరు వెయ్యి పడకల ఆస్పత్రులు, ఇవన్నీ స్వాగతించాల్సిన విషయాలే, వాటిని స్వాగతిస్తున్నామని అన్నారు.

జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు షాకిచ్చాయి. టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలుపొందడం.. మిగిలిన పార్టీలు కనీస సమీపంలో కూడా కనిపించకుండాపోవడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ రికార్డు స్థాయిలో 99 సీట్లు సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లను మాత్రమే సొంతం చేసుకుంది. అయితే రెండు సీట్లు వచ్చినా కానీ తాము మాత్రం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని దానం అంటున్నారు. తాము ఇక మీదట నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, వాళ్లిచ్చిన వాగ్దానాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటామని చెప్పారు. వాటిని అమలు చేయలేకపోతే కారణాలేంటో చెప్పాల్సిన బాద్యత వాళ్లకు ఉంటుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danam nagender  Danam  Hyderabad  GHMC  Congress  

Other Articles