Pawan kalyan said that he is not supporting any party

Pawan kalyan said that he is not supporting any party

Pawan Kalyan, kapu, kapu reservations, pawan Kalyan on Kapu Protest, pawank kalyan on Kapus, janasena, janasena party

Janasena party Leader Pawan Kalyan said that he is not supporting any caste or any religion.

కులం కోసం కాదు.. ప్రజల కోసం పోరాడతాను: పవన్ కళ్యాణ్

Posted: 02/01/2016 05:24 PM IST
Pawan kalyan said that he is not supporting any party

తాను ఏ కులాన్ని సపోర్ట్ చేస్తూ పోరాడనని.. కేవలం ప్రజల కోసం పోరాడతానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగిన హింస మీద పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడారు. కాపుల పోరాటం ఇప్పటిది కాదని.. అలాగే ఒక్క రోజులో ముగిసిపోయేది కూడా కాదని పవన్ అభిప్రాయడ్డారు. పార్టీ స్థాపించే సమయంలోనే తాను చెప్పానని.. తాను కులాలకు కాదు.. జాతీయ భావాలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ మాటల్లో ముఖ్యాంశాలు..
*రిజర్వేషన్ల సమస్య ఒక్క రోజులో తీరేది కాదు
*తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు
*ఈ సమస్యకు సామరస్య పూర్వక పరిష్కారం కావాలి. అన్ని పార్టీలు ఇందుకు సహకరించాలి
*దేశం కులాల సమ్మేళనం. కాబట్టి ఒకరి గురించి ఎక్కువ మాట్లాడినా.. తక్కువ మాట్లాడిన తప్పు
*ప్రభుత్వం సరైన సంప్రదింపులు జరిపి.. సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నా
*ఉద్యమాన్ని ముందుకు నడిపే ఉద్యమ నాయకులకు చాలా బాధ్యత ఉండాలి
*అన్ని లక్షల మంది వస్తుంటే ఎందుకు ముందు జాగ్రత్తలు పాటించలేదు..?
*శిక్షణ పొందిన వ్యక్తులే ట్రెయిన్ ను తగులబెట్టి ఉంటారు
*బిసీ కులాలకు నష్టం వాటిల్లకుండా.. కాపులకు న్యాయం చెయ్యగలిగితే మంచిది.
*చెయ్యలేకపోతే.. పరిస్థితిని వివరించండి అంతేకానీ మీమాంసలో మాత్రం ఉంచకండి
*రాజకీయ నాయకులు బాధ్యతగా వ్యవహరించాలి
* నేను ఏ కులం కోసం పోరాడను.. ప్రజల కోసం పోరాడతాను
*కులాల వ్యవస్థ మీద కాదు... జాతీయ బావాల మీదే నా పార్టీ ఉంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles