AP CM Chandrababu Naidu slams jagan on Kapu violent protest

Ap cm chandrababu naidu slams jagan on kapu violent protest

Kapu, kapu Reservations, YSRC, jagan, Chandrababu naidu, Mudragada Padmanabham, Tuni, Violence in Tuni, Violence in Kapu Protest

After a stir by Kapu community members seeking reservation under Backward Class category turned violent in Andhra Pradesh, Chief Minister N Chandrababu Naidu on Sunday said he is committed to reservation for the community. "I am committed to reservation for Kapu community for which a Judicial Commission was also constituted," Naidu told reporters.

ITEMVIDEOS: ఆ నేరస్థుడి వల్లే హింస అంటున్న చంద్రబాబు

Posted: 02/01/2016 08:51 AM IST
Ap cm chandrababu naidu slams jagan on kapu violent protest

ఏఫిలో నిప్పురాజుకుంది. తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. కాగా ఈ ఘటన మీద ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ నేరగాడు తన స్వార్థం కోసమే తునిలో విధ్వంసం సృష్టించారని చంద్రబాబు మండిపడ్డారు. 25 వాహనాలు, రెండు పోలీస్ స్టేషన్లను తగులబెట్టారన్నారు. ఇదంతా చేసింది పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ పార్టీలేనని మండిపడ్డారు ముఖ్యమంత్రి. విధ్వంసం సృష్టిస్తే నష్టపోయేది ఎవరో ఆలోచించుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని, దీనిపై పూర్తిగా సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా చూడాల్సి ఉందన్నారాయన.


అసెంబ్లీలోనూ, బయట రౌడీయిజం చేయాలని కొందరు చూస్తున్నారని, ఇలాంటి పనుల చేయడం వల్ల ఎవరికి నష్టమో కాపులు ఆలోచించుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. అందరూ సంయమనంగా ఉండాలని సూచించారు. ఒక నేరగాడు పదే పదే రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తండ్రి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదు? ఈ విషయాలన్నీ కాపులు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వారి కారణంగా సంయమనం కోల్పోవద్దు... అది సమాజానికి మంచిది కూడా కాదు అని కాపులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles