Bose's treasure trove had women's jewels

Bose s treasure trove had women s jewels

Bose, SubhashChandraBose, Jewels, Boses treasure

On October 9, 1978, a group of government officials opened a time capsule from Indian history at the National Museum in Janpath. Officials from the ministries of culture and external affairs watched as museum officials snipped open a sealed canvas diplomatic bag of the MEA, flipped open a steel attache case inside and took out 14 packages.

నేతాజీ విమానంలో భారీగా బంగారం..!

Posted: 01/30/2016 09:06 AM IST
Bose s treasure trove had women s jewels

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదం జరిగిందని చెబుతున్న రోజు… అంటే 1945 ఆగస్టు 18న ఏం జరిగింది..? ఆయన తనతో పాటు విమానంలో ఏం తీసుకువెళ్లారు..? ఇలాంటి ఆసక్తికర విషయాలను వెల్లడి చేస్తున్నాయి… ఈ ఏడాది జనవరి 23న బయటపెట్టిన నేతాజీ 100 సీక్రెట్ ఫైల్స్. ఫైల్ నెం. 25/4/ఎన్జీవో వాల్యూమ్ నెం. 3 మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టెర్నల్ ఎఫైర్స్ లో ఈ సమాచారం ఉంది. బోస్‌ తన వెంట భారీస్థాయిలో బంగారాన్ని విమానంలో తీసుకువెళుతుండగానే దుర్ఘటనలో చనిపోయారని చరిత్రకారులు భావిస్తున్నారు. విదేశాంగ వ్యవహారాల కస్టడీలో ఉన్న ఈ దౌత్యపరమైన బ్యాగ్‌ను 1978లో నేషనల్‌ మ్యూజియం అధికారులు తెరచిచూడగా మహిళలు ధరించే చెవి రింగులు, ముక్కు పుడకలు, బంగారు తీగెలు, నెక్లెస్‌లు కనిపించాయి.

ఇవన్నీ మంటల్లో పూర్తిగా కాలి మాడిపోయిన స్థితిలో వారు కనుగొన్నారు. అయితే విప్లవవీరుడికి ఆడవాళ్ల ఆభరణాలతో పనేంటని ఎవరికైనా అనుమానం రావచ్చు. జపాన్‌పై ఆర్థికంగా ఆధారపడడం తగ్గించుకోవాలని భావించి బోస్‌ సొంతంగా నిధులను సమీకరించారని హ్యూగ్‌ టోయ్‌లాంటి చరిత్రకారులు చెప్పారు. బోస్‌ నేతృత్వంలోని ఐఎన్‌ఏకు మహిళలు ఉదారంగా పెద్దఎత్తున తమ బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. 80 కిలోలపైనే ఉండే ఈ బంగారం విలువ 1945లోనే కోటి రూపాయల పైమాటేనని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bose  SubhashChandraBose  Jewels  Boses treasure  

Other Articles