No people it no police

No people it no police

Police, Police for the public, Police services

As protesters around the nation continue to call for police reform, they are regularly reminded of an important fact: While some officers abuse their power, the majority are "good cops." For every officer who visits harm on someone or violates the public's trust, there are countless others who follow the rules and who want nothing more than to protect, serve and return home safe at the end of their shift.

పోలీస్ లేకుంటే... ప్రజలు లేరు

Posted: 01/28/2016 03:32 PM IST
No people it no police

కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతి రూపాలైతే కనిపించిన నాలుగో సింహమేరా పోలీస్ ఇది పోలీస్ వృత్తిలో ధైర్యాన్ని, ఆవేశాన్ని, ఆత్మవిశ్వసాన్ని తెలిపే డైలాగ్. చూపులో గాంభీర్యం, చెప్పుకోవడానికి హుందాతనం ఉన్నా.. ఈ కవాతు కత్తి మీద సామే. వృత్తి, ప్రవృత్తులు ఎన్నయినా ఆఖరి లక్ష్యం శాంతి స్థాపనే.రక్షక భటులు తమ ప్రాణాలకు తెగించి సమాజ రక్షణకు పాటుపడుతూ ఉంటారు. ఖాకీ యూనిఫాంలో ప్రజలకు సహజమితృలుగా కనిపించే పోలీసులను చూస్తే కొండంత ధైర్యం ఆపదలో ఉన్న వారికి కలుగుతుంది. పోలీసులు కూడా కట్టుకున్న వారిని, కన్న పిల్లలను విడిచి విధినిర్వహణ పరమావధిగా భావిస్తూ ప్రాణాలను తణప్రాయంగా త్యాగించిన సంఘటనలు కోకోల్లలుగా ఉంటాయి. అమరజవానుల బలిదానంను స్మరించుకోవలసిన క్షణాలు ఇవి. చైనా యుద్ధం నుంచి నేటి అంతర్గత భద్రత కోసం సాయుధసంఘర్షణలో ప్రతి నిత్యం చావు బ్రతుకుల మధ్య పోరాటం సాగిస్తూనే ఉన్నారు.

అయితే కొంత మంది చేస్తున్న చర్యలు మాత్రం పోలీసులకు తీవ్ర మనోవేధన కలిగిస్తోంది. ప్రజల కోసం తమ ప్రాణాలను, ఫ్యామిలీని కాదని.. నిరంతరం శ్రమించే పోలీసులకు అక్కడక్కడా ఛేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నిన్న కీసర మండలంలో ఓ అమ్మాయి రాంగ్ రూట్ లో వస్తున్నందుకు తన ఫోటో తీసిన హోంగార్డ్ చెంప ఛెళ్లుమనిపించింది. అయితే తర్వాత అమ్మాయి జైలుపాలైనా కానీ ఆ హోంగార్డ్ మాత్రం ఎంతో అవమానంగా భావించి ఉంటాడు.

ఎంతో మంది పోలీసులు.. దొంగలను, నక్సలైట్లను, రౌడీలను పట్టుకోవడానికి తమ ప్రాణాలను కూడా అడ్డేసి పోరాడుతుంటారు. కానీ మనలో చాలా మంది పోలీసుల బాధ్యతను గుర్తించకుండా.. వారి మీద విమర్శలు చెయ్యడం.. వారి మీద లేనినిందలు వేస్తుంటారు. అయితే ప్రతి ఊరికి ఓ స్మశానం ఉన్నట్లు పోలీస్ శాఖలొ కూడా అవినీతిపరులు ఉన్నా కానీ ఆ ఒక్క అవినీతిపరుడి వల్ల వేల సంఖ్యలో ఉన్న నిజాయితీపరులైన పోలీసులను సమాజం గుర్తించలేకపోతోంది. కానీ కనీసం ఇక ముందైనా కానీ అందరూ కూడా పోలీసుల పాత్రను గుర్తించి. వారిని గౌరవిస్తారని అనుకుంటున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Police for the public  Police services  

Other Articles