Governor narasimhan greets telangana people on Republic Day

Governor narasimhan greets telangana people on republic day

Telangana, Republic Day, Governar, narasimhan

Governor narasimhan greets telangana people on Republic Day. He also told the telangana govt schemes and programmes.

తెలంగాణ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

Posted: 01/26/2016 12:44 PM IST
Governor narasimhan greets telangana people on republic day

తెలంగాణ ప్రజలకు గవర్నర్ నరసింహన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. ఎందరో మహానీయుల త్యాగఫలమే ఈ వేడుకలు జరుపుకుంటున్నామని వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్స్ ఇండ్లతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో రాష్ట్రం ముందు వరుసలో ఉందని... రాష్ట్రంలో విద్యుత్ సమస్య నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

మన ఊరు - మన చెరువు ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటుందని... 2018 నాటికి 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించేందుకు చెరువుల పునరుద్ధరణ జరుగుతుందని... ఇంటింటికి తాగునీరందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించిందని... రాష్ట్రంలో ఇప్పటికే 66 వేల డబుల్ బెడ్‌రూమ్స్ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Republic Day  Governar  narasimhan  

Other Articles