Hyderabad university VC goes on indefinite leave

Hyderabad university vc goes on indefinite leave

Hyderabad Central University, HCU, HOU, Rohith, Rohith Suicide

Hyderabad Central University vice-chancellor Appa Rao Podile, who is facing protests over the suicide of Dalit scholar Rohith Vemula, left on an indefinite leave, the varsity website said. In his absence, Vipin Srivastava, the senior most professor, will perform the duties of the vice-chancellor, the university announced on Sunday.

సెలవు పెట్టిన హైదరాబాద్ వర్సిటీ విసి

Posted: 01/24/2016 06:39 PM IST
Hyderabad university vc goes on indefinite leave

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అప్పారావు లీవు తీసుకున్నారు. గత వారం పిహెచ్.డి చేస్తున్న రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్యతో వర్సిటీలో ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. గత కొంత కాలంగా యూనివర్సిటీ అట్టుడుకుతోంది. అయితే రాజకీయ నాయకుల ప్రమేయం వల్లనే రోహిత్ ాత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాసిన లేఖ ఆధారంగా.. స్ర్ముతి ఇరానీ చేసిన వత్తిడి వల్లే రోహిత్ ను యూనివర్సిటి నుండి సస్పెండ్ చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు.

రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తంకావడంతో HCU వైస్ చాన్సలర్ అప్పారు లీవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో తాత్కాలిక వీసీగా ప్రొఫెసర్ విపిన్ శ్రీవాస్తవను నియమించారు. అయితే కొత్త వీసీ నియామాకాన్ని వ్యతిరేకిస్తున్నారు వర్సిటీలో విద్యార్థులు. రోహిత్ మరణానికి శ్రీవాస్తవ కూడా కారణమని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Central University  HCU  HOU  Rohith  Rohith Suicide  

Other Articles