Pakistan has around 130 nuclear warheads to deter an attack from India

Pakistan has around 130 nuclear warheads to deter an attack from india

Pakistan, India, Warheads, Nuclear warheads, Pak, Amrica

Pakistan's nuclear warheads which are estimated to be between 110-130 are aimed at deterring India from taking military action against it, a latest Congressional report has said. The report also expressed concern that Islamabad's "full spectrum deterrence" doctrine has increased risk of nuclear conflict between the two South Asian neighbours.

పాక్ వద్ద 130 అణ్వాయుధాలు సిద్ధం

Posted: 01/22/2016 08:23 AM IST
Pakistan has around 130 nuclear warheads to deter an attack from india

ఇండియా పాకిస్థాన్ల వైరం గురించి ప్రపంచంలో ఏదేశాన్ని అడిగినా చెబుతారు. పాకిస్థాన్ భారత్ మీద దాడికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. బారత్ దూసుకెళుతుంటే తట్టుకోలేని పాక్ ఎలాగైనా దెబ్బకొట్టాలని కాచుకూర్చుంది. తాజాగా మరో విషయాన్ని పాకిస్థాన్ అమెరికా వెల్లడించింది. ఏ క్షణంలోనైనా భారత్ ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ 130 పైగా అణ్వాయుధాలతో సిద్ధంగా ఉన్నట్లు అమెరికా పరోక్షంగా చెప్పింది. భారత్ ను నిరోధించేందుకు ఆ దేశం అణ్వాయుధ సామాగ్రిని కుప్పలుగా సమకూర్చుకుంటుందని, కొనగోళ్లు, తయారీ ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ఓ రిపోర్ట్ లో వెల్లడించింది. ముఖ్యంగా ఇస్లామాబాద్ దాడి నిరోధక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని తెలిపింది.

ఒక వేళ పాకిస్థాన్ పై భారత్ సైనిక చర్య తీసుకుంటే దానిని అడ్డుకుని, నిరోధించేందుకు 110 నుంచి 130 వరకు అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఉందని, అంతకంటే ఎక్కువ ఆయుధాలు కూడా ఉండొచ్చని వెల్లడించింది. అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) అనే సంస్థ ఈ వివరాలను తెలియజేసింది. భారత్ లో కూడా అణ్వాయుధ సామాగ్రి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆయుధాల విషయంలో రెండు దేశాల మధ్య పోటీ ఏర్పడి అదొక కొత్త సమస్యకు దారి తీయొచ్చని కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తాము అణ్వాయుధాలుగల దేశంగా ప్రపంచానికి విశ్వాసం కలిగించేందుకు ఇప్పటికే పలుమార్లు పాకిస్థాన్ తన అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించిందని కూడా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  India  Warheads  Nuclear warheads  Pak  Amrica  

Other Articles