WhatsApp to go free globally

Whatsapp to go free globally

Whatsapp, Free Whatsapp, Social Media, Free Whatsapp, Whatsapp free globally

Popular messaging app WhatsApp said it will stop charging $1 per year subscription fee to go completely free for its users across the world. The service, which claims to have over a billion users globally, also said it will not introduce any third-party ads for monetisation. “Nearly a billion people around the world today rely on WhatsApp to stay in touch with their friends and family...WhatsApp will no longer charge subscription fees,” WhatsApp said on its official blog.

ఇక మీదట వాట్సాప్ ఫ్రీ. ఫ్రీ

Posted: 01/19/2016 01:25 PM IST
Whatsapp to go free globally

మనకు ఫ్రీగా వస్తుంది అంటే అది ఏదైనా సరే అందుకోవడాని్కి ముందుంటా. అయితే వాట్సాప్ మీ ఫోన్ లో ఫ్రీగా వస్తుంది అనే వార్త వింటే మీరు ఎలా ఫీలవుతారు. మీరే కాదు ఎవరైనా హ్యాపీగా ఫీలవుతారు. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్... ఇలా మీరు ఏ ప్లాట్‌ఫాంలో వాట్సప్‌ను వాడుతున్నా ఇకపై యానువల్ ఛార్జ్ 68రూపాయలు చెల్లించాల్సిన పనిలేదు. ఈ యాప్ సేవలను యూజర్లు ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందిన తరువాత సేవలను కొనసాగించాలంటే రుసుము చెల్లించాలని ఇప్పటి వరకు వాట్సప్ యూజర్లకు మెసేజ్ దర్శనమిచ్చేది. కానీ ఇప్పుడు ఆ మెసేజ్ త్వరలో కనుమరుగు కానుంది. రానున్న కొద్ది రోజుల్లోనే ఉచితంగా వాట్సప్‌ను పొందవచ్చని ఆ కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సప్ ప్రతినిధులు చెబుతున్నా అందుకు వేరే కారణం ఉందని టెక్ పండితులు విశ్లేషిస్తున్నారు. నేటి స్మార్ట్ ప్రపంచంలో ఇతర ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవాలంటే యూజర్లకు ఇలా సేవలు అందించాల్సిందేనని, ఈ నేపథ్యంలోనే వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఏది ఏదైతేనేంటి మనకు మాత్రం వాట్సాప్ ఫ్రీగా వస్తోంది.. మరి హ్యాపీనే కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Whatsapp  Free Whatsapp  Social Media  Free Whatsapp  Whatsapp free globally  

Other Articles