Today congress vice President Rahul gandhi visits HCU

Today congress vice president rahul gandhi visits hcu

HCU, Hyderabad central University, Rohith Vemula, Rahul Gandhi, Rahul Gandhi to Hyderabad, Bandaru Dattatreya, Smruthi Irani

Today congress vice President Rahul gandhi visits HCU. The suicide of Rohith Vemula, a Dalit research scholar at the University of Hyderabad, is yet another tragic testimony to the feudal passions of caste that roil India’s institutions of higher education, which are known to harbour delusions of being meritocracies. Vemula was one of five Dalit students, all belonging to the Ambedkar Students Association (ASA), who had been suspended by the administration.

హెచ్.సి.యుకు రాహుల్ గాంధీ

Posted: 01/19/2016 01:21 PM IST
Today congress vice president rahul gandhi visits hcu

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆందోళనలతో అట్టుడుకుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. రోహిత్ ఆత్మహత్య, తదనంతర పరిణామాలపై సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత వర్సిటీ విద్యార్ధులతోనూ రాహుల్ సమావేశం కానున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ వర్సిటీకి వెళతారు. కాగా ఈ కేసులో ఇప్పటికే హెచ్.సి.యు విసి అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీద కేసు నమోదు కాగా.. పోలీసులు విచారణ చేస్తున్నారు.

రీసెర్చి స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో వర్సిటీలో ఆందోళనలు జరుగుతున్నాయి. చూస్తుంటే ఈ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసేలా ఉంది. దళిత వర్గానికి చెందిన విద్యార్థులను సస్పెండ్ చేయడంతో మనస్తాపానికి గురై రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రోహిత్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన జ్వాల దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. హస్తినలోనూ విద్యార్థులు కదం తొక్కారు. హెచ్ ఆర్డీ కార్యాలయం ముట్టడికి విశ్వప్రయత్నం చేశారు. దీని మీద కేంద్ర మంత్రి స్ర్ముతి ఇరానీ స్పందించారు. తాను దీని మీద ఎలాంటి రాజనీయాలు చేయదలుచుకోలేదని వెల్లడించారు. కాగా కేంద్ర మంత్రులు ఇలా ఆత్మహత్య వ్యవహారంలో ఇరుక్కోవడంతో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రంగ ప్రవేశం చేస్తున్నారు. కాగా నేడు దర్యాప్తు బృందం హెచ్.సి.యు చేరుకోనున్న నేపథ్యంలో ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందొబస్తును ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles