Wild bomb in Prakasham

Wild bomb in prakasham

Prakasham, AP, WIld Bomb, Bomb

In Ap, Prakasham District willd bomb explosion happened. In this incident two people injured.

ప్రకాశంలో నాటుబాంబు పేలుళ్లు

Posted: 01/17/2016 02:56 PM IST
Wild bomb in prakasham

ఏపిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రకాశం జిల్లాలో నాటు బాంబుల పేలుళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నాటు బాంబులు పేలిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బొచ్చువారి పాలెం గ్రామంలోని పోలేరమ్మ దేవాలయం వద్ద అనుమానంగా కనిపించిన వస్తువును శ్రీనివాసరావు అనే యువకుడు చేతిలోకి తీసుకున్నాడు. కర్పూరంలా ఉందని దాని వాసన చూసి గోడకు రుద్దాడు. అంతే ఒక్కసారిగా అది పేలింది. దీంతో శ్రీనివాసరావు ఎడమ చేయి తెగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు శబ్దం వినిపించడంతో వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు మరో బాంబు పేలింది. దీంతో వెంకటేశ్వర్లుకు కూడా తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చీరాల ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ పేలినవి నాటు  బాంబులని తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. అసలు నాటు బాంబులు అక్కడికి ఎలా వచ్చాయన్నది ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakasham  AP  WIld Bomb  Bomb  

Other Articles