3 bags of notes found gutted in fire from beggar's house in Mumbai!

Beggar s cash in 3 gunny bags turns to ash in fire

Mumbai Beggar, Sacks of Cash, Cash Found At Mumbai Beggars Home, Bags of Cash, Mohammad Rahman, Begging, Earnings, Scorching, Lahuji Nagar slums, Khadakpada police, Hut, gunny bags, fire, fatima, beggar from Ambivli

When residents of a slum in Kalyan near Mumbai went to douse a fire that had broken out in one of the houses, sacks full of cash left them shocked.

మూడు సంచులలో దాచిన .10 లక్షల కష్టార్జితం కాలిపోయింది

Posted: 01/15/2016 10:06 AM IST
Beggar s cash in 3 gunny bags turns to ash in fire

అతని పేరు మహమ్మద్ రెహ్మాన్. ముంబయ్ శివారు కల్యాణ్ ప్రాంతంలో నివసిస్తున్న ఈ వృద్దుడు స్థానికంగా బిక్షాటన వృత్తిగా ఎంచుకున్నాడు. తన సంపాదనను దాచుకుని ఒకేసారి, భార్య పిల్లలకు చూపించి ఆశ్యర్యానికి గురిచేయాలని, వారి మంచి భవిష్యత్తు కల్పించాలన్న ఆయన ఆశ కాలిపోయింది. ఏళ్ల తరబడి భిక్షాటన చేసి సంపాదించుకున్న డబ్బు ఎలుక పుణ్యమాని తగులబడిపోయింది. అదేం చిన్నా చితకా కాదు.. ఏకంగా రూ. 10 లక్షల రూపాయలు.

తాను అడుక్కుని సంపాదించుకున్న డబ్బంతా, భార్య ఫాతిమాకు తెలియకుండా బస్తాల్లో కూరి పెడుతుండేవాడు. గత రాత్రి కరెంటు పోవడంతో.. ఇంట్లో దీపం పెట్టుకుని పడుకున్నారు. మర్నాడు తెల్లవారు జామున ఎలుక దీపాన్ని పడవేయడంతో గుడిసెకు నిప్పంటుకుంది. ఈ అగ్నిప్రమాదంలో రెహ్మాన్ గుడిసె తగులబడగా, బస్తాల్లో కూరి ఉంచిన 10, 50 రూపాయల నోట్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రెహ్మాన్ గుండెలవిసేలా రోధించాడు. మొత్తం ఎంత డబ్బు దగ్ధమైనదన్న విషయం తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు.

ఇంటికి నిప్పంటుకున్న సమయంలో అతను లేడని, అందువల్ల వాటిని బయటకు తెచ్చే అవకాశం లేకపోయిందని, అతని భార్య మాత్రం ప్రాణాలను కాపాడుకుందని వివరించారు. అగ్నిప్రమాదం ఘటన గురించి తెలుసుకుని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న వేళ, రెండు బస్తాల్లోని నోట్లన్నీ పూర్తిగా దహనమై ఉండటాన్ని గమనించారు. మూడవ బస్తాలోని దాదాపు సగం నోట్లు మాత్రం మిగిలాయని తెలిపారు. ఆ యాచకుడికి బ్యాంకు ఖాతా లేకపోవడంతోనే బస్తాల్లో డబ్బు దాచుకుంటూ వచ్చాడని ఖడక్ పడా పోలీసు స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Rahman  Begging  Earnings  Scorching  

Other Articles