strip dancer pole dance draws commuters attention in london train

Woman strips for uk lifestyle website

woman strips for uk lifestyle website, strip dancer,pole dance,draws,commuters attention,london train, UK based lifestyle website, london website publicity, stripping clothes for publicity,

commuters in west london under ground train enjoys as a woman strips to inners drawing attention for UK based lifestyle website publicity

పబ్లిసీటీ కోసం.. పబ్లిక్ గా రైలులో బట్టలిప్సేసిన యువతి..

Posted: 01/13/2016 05:19 PM IST
Woman strips for uk lifestyle website

అది లండన్‌ అండర్‌గ్రౌండ్‌ మెట్రో రైళ్లు. అందులో ప్రయాణిస్తున్న వారెవరూ సాధారణంగా తమ పక్కవాళ్లతో కనీసం మాట్లాడరు. అసులు పట్టించుకున్న పాపన బోరు. తమ వద్దనున్న పుస్తకాలను తిరిగేయడమే.. లేక ఫోన్‌, ల్యాప్‌టాప్‌లతో తమ వారితో చాటింగ్ చేయడమో లాంటివి చేస్తూ.. ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. అయితే గత సోమవారం మాత్రం ఒక యువతి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. ఇంతకీ ఆమె పెద్ద సెలబ్రిటీ కాదు.. కానీ అందరి దృష్టిని అకర్షించింది. అలా తనకప్పగించిన కార్యం పూర్తి చేసింది.

ఏమిటీ కార్యం.. ఇంతకీ ఎవరామే అనేగా మీ సందేహం.. అమె ఒక స్ర్టిప్‌ డ్యాన్సర్‌. ఉదయం పూట రష్‌ హవర్‌లో పశ్చిమ లండన్‌ ప్రాంతంలో ట్రైన్‌ ఎక్కింది రైలులో ప్రయాణికులందరూ ఈ ప్రపంచం గురించి పట్టించుకోకుండా చాలా బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ యువతి తన శరీరంపై ఉన్న ఒక్కో వస్త్రాన్ని విప్పేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు లో దుస్తులు మాత్రమే ఉంచుకుని పోల్‌ డ్యాన్స్‌ చేసింది. దీంతో అందరూ తమ పనులు వదిలేసి ఆమె వైపే కన్నార్పకుండా చూడడం మొదలెట్టారు.

అయితే ఆమెకు మతి భ్రమించి ఇదంతా చేయలేదు. అదంతా ఓ పబ్లిసిటీ గిమ్మిక్కు. యూకేకు చెందిన ఓ లైఫ్‌స్టైల్‌ వెబ్‌సైట్‌ చేసిన ప్రచారపు స్టంట్‌ ఇదంతా. ఆ యువతి డ్యాన్స్‌ చేయడం పూర్తయిన తర్వాత ఒక పెన్ను, పేపర్‌ తీసుకని అందరి వద్దకూ వెళ్లి సదరు వెబ్‌సైట్‌ గురించి నాలుగు వాక్యాలు రాయమని అడగింది. దీంతో ఆ ట్రైన్‌లోని వారంతా ఈ అమ్మడి రిక్వెస్టు కాదనలేక వారి అభిప్రాయాలు రాసిచ్చారు. మామూలుగా వెళ్లి అడిగితే ఎవరూ ఏమీ చెప్పరని, ఇలా ప్లాన్‌ చేశారట సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  strips  train  lifestyle website  

Other Articles