22 more Telugu students sent back from US

22 more telugu students sent back from us

America, US, Telugu Students, Telugu students return from America, Shamshabad Airport

twenty two more students from Telangana and Andhra Pradesh returned to Hyderabad on Saturday after being deported by the American authorities.

మరో 22 మంది విద్యార్థులను తిప్పి పంపిన అమెరికా

Posted: 01/11/2016 01:07 PM IST
22 more telugu students sent back from us

చదువుకుంటామని ఆశలతో అమెరికా వెళ్లిన మన తెలుగు విద్యార్థులకు అక్కడ చుక్కలు చూపించి తిరిగి పంపుతున్నారు అక్కడ అధికారులు. వారం క్రితం కొంత మంది విద్యార్థులను గుర్తింపులేని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందడానికి వచ్చారంటూ తిరిగి పంపించేశారు. తాజాగా మరో 22 మంది తెలుగు విద్యార్థులను తిరిగి పంపించింది అమెరికా. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకోవడానికి దాదాపు 30 మంది తెలుగు విద్యార్థులు రెండు రోజుల క్రితం వెళ్లారు. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులోకి వెళ్లాగానే అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు రకరకాల ప్రశ్నలు వేశారు. చివరకు మీరు చదివే వర్సిటీలు బ్లాక్‌ లిస్టులో ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.  అమెరికా ప్రభుత్వం ఇచ్చిన  అన్ని పత్రాలూ తీసుకొని వచ్చాం కాదా? అయినా మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అని కొందరు విద్యార్థులు ప్రశ్నించారు. ఆగ్రహించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు విద్యార్థుల చేతులకు బేడీలు వేసి.. వివిధ ప్రాంతాలకు తిప్పుతూ 24 గంటలపాటు చిత్రహింసలకు గురిచేశారు.

న్యూయార్క్‌ నుంచి వచ్చేసిన విద్యార్థులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనూ కష్టాలు తప్పలేదు. విద్యార్థులను ఎయిర్‌ ఇండియా యాజమాన్యం.. టికెట్‌ ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలని పట్టుబట్టింది. తాము అంత మొత్తం చెల్లించలేమని చెప్పడంతో ఎనిమిది గంటల పాటు వారిని కదలనీయలేదు. ఓ దశలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయంలో ఆందోళన చేసినా అధికారులు స్పందించలేదు. ముఫ్తీ మహ్మద్‌ అంత్యక్రియలకు హాజరై కశ్మీర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీకి విద్యార్థులు తమ పరిస్థితిని వివరించారు. ఈ విషయమై ఇమ్మిగ్రేషన్‌ అధికారులపై అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం సూచనతో అధికారులు విద్యార్థులను వదిలిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  US  Telugu Students  Telugu students return from America  Shamshabad Airport  

Other Articles