The final message to Indian from Netaji

The final message to indian from netaji

Netaji, Netaji SUbhash ChandraBose, Bose last Message, Netaji News

Netaji Subhas Chandra Bose died in a plane crash in Taiwan in 1945 and till his last breath exhorted Indians to fight for their freedom, a British website has claimed. Releasing what it claims are eyewitness accounts of the fateful day, the website www.bosefiles.info has quoted several people who were reportedly involved in the matter related to the accident as well as two British intelligence reports that revisited the crash site.

నేతాజీ చివరి సందేశం ఇదే..!

Posted: 01/10/2016 12:43 PM IST
The final message to indian from netaji

నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మృతికి సంబంధించిన కీలక సమాచారాన్ని బ్రిటన్‌కు చెందిన ఓ సైట్‌ పొందుపర్చింది. నేతాజీ చివరి రోజులకు సంబంధించిన వివరాల పట్టినకను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షులప్రకారం 1945 ఆగస్టు 18న తైవాన్ విమానం కూలిన ఘటనలో నేతాజీ మరణించినట్టు వెబ్‌సైట్ పేర్కొంది. ఈ విషయాన్ని ఆనాడు ప్రత్యక్షంగా చూసినవారితోపాటు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన ఇద్దరు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ఆధారంగా నేతాజీ విమానం కూలిన ఘటనలోనే మృతిచెందారని పేర్కొంది. అంతేకాదు చనిపోతూ చివరిగా చెప్పిన మాటలు ఆయన భారతదేశం స్వేచ్ఛా స్వాతంత్య్ర కాంక్షను తెలియజేస్తున్నాయని వెబ్‌సైట్ తెలిపింది.

విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బోస్ తన చివరి సందేశాన్ని భారత ప్రజలకు చేరవేయాలని కర్నల్ రహ్మాన్‌ను కోరారు. మీరు భారత్‌కు తిరిగి వెళ్లినప్పుడు నా కొనప్రాణం వరకు దేశం కోసమే పోరాడానని ప్రజలకు చెప్పాలి. స్వాతంత్య్రం కోసం పోరాటాన్ని కొనసాగించాలి. హిందుస్థాన్‌కు స్వాతంత్య్రం వస్తుంది. భారతీయులు ఎంతో కాలం బానిసలుగా ఉండరు అని అన్నారు. విమానం ప్రమాదం తర్వాత మొదటిసారి బోస్‌ను చూసినప్పుడు దుస్తులు మంటల్లో కాలిపోతుండగా అతని సహాయకుడు రహ్మాన్ విప్పే ప్రయత్నం చేస్తున్నాడని బోస్‌తోపాటు ప్రయాణించిన లెఫ్టినెంట్ కర్నల్ శిరో నోనోగాకి పేర్కొన్నారు. అయితే తీవ్రంగా గాయపడ్డ నేతాజీని స్థానిక నాన్మోన్ మిలిటరీ దవాఖానలో చేర్పించారని మరో కథనం ఉంది. ఇది సెప్టెంబర్ 1945లో చోటుచేసుకున్నట్టు సమాచారం. నేతాజీ కోసం అప్పట్లో భారత్‌లోని బ్రిటిష్ అధికారులు హెచ్‌కే రాయ్, కేపీ డీ నేతృత్వంలోని బృందాన్ని బ్యాంకాక్, సైగోన్, తైపేకి పంపించింది. బోస్ ఎక్కడున్నారో తెలుసుకోవాలని, వీలైతే అరెస్ట్ చేయాలని ఈ బృందం ప్రయత్నించగా, విమాన దుర్ఘటనలో బోస్ చనిపోయినట్టు తెలియడంతో వారు తిరిగి వచ్చారు.

బోస్ గురించి ఆ వెబ్ సైట్ లో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ http://www.bosefiles.info/ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Netaji  Netaji SUbhash ChandraBose  Bose last Message  Netaji News  

Other Articles