Non bail warrant to dhoni

Non bail warrant to dhoni

Dhoni, MS Dhoni, Dhoni is contraversy, Mahendra Singh Dhoni

Anantapur court issued Non Bail warrant to MS Dhoni. court issued aNon bail warrant for Indian cricket team captain Mahendra Singh Dhoni for allegedly hurting religious sentiments of Hindus.

ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Posted: 01/08/2016 11:28 AM IST
Non bail warrant to dhoni

అవును మీరు చదువుతున్నది నిజమే. గతంలో ధోనీని విష్ణుమూర్తిగా చిత్రీకరిస్తూ ఓ మ్యాగజీన్ కవర్ మీద వచ్చిన ఫోటో వివాదం ధోనీని ఎంతకీ వదలడం లేదు. కెప్లెన్ కూల్ గా, క్రీజ్ లో అద్భుత బ్యాటింగ్ తో అలరించే ధోనీ మీద వివాదం రాజుకుంది. ధోనీ మీద అభిమానం ఆయన కొంపముంచుతోంది. ధోనీని విష్ణుమూర్తి అవతారంగా చూపించడం మీద హిందు ధార్మిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే తాజాగా అనంతపురం కోర్టు ఇదే విషయం మీద ధోనీకి నాన్ బెయిలెబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.

బెంగళూరు కోర్టులో ఇదే కేసు విచారణ సాగుతుండగా.. అనంతపురం కోర్టు ఇదే కేసులో ధోనీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నోటీసులు ఇచ్చినా ధోనీ హాజరుకాకపోవడంతో అనంతపురం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీహెచ్పీ నేత శ్యాంసుందర్ అనంతపురం కోర్టులో కేసు దాఖలు చేశారు. బెంగళూరులో మరో వ్యక్తి ధోనీపై కేసు పెట్టారు. మత విశ్వాసాలను కించపరిచేలా ఈ ప్రకటన ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ధోనీ తీరుపై బెంగళూరు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhoni  MS Dhoni  Dhoni is contraversy  Mahendra Singh Dhoni  

Other Articles