26/11 hero as security consultant for Team India

26 11 hero as security consultant for team india

The Board of Control for Cricket, Govind Singh Sisodia, Team India, Cricket, NSG

The man who led the NSG operation during the 26/11 Mumbai attack has been given the task to handle the security of the Indian team during the tour of Australia that will begin this week.The Board of Control for Cricket (BCCI) has appointed Brigadier (retired) Govind Singh Sisodia as Team India’s security consultant.

టీమిండియా సెక్యురిటీ కోసం 26/11 హీరో..?

Posted: 01/07/2016 12:33 PM IST
26 11 hero as security consultant for team india

టీమిండియా క్రికెట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. అయితే ఈ సిరీస్ లో టీమిండియాకు రక్షణ కల్పించే బాధ్యతను ఓ వ్యక్తికి అప్పగించింది. ఆ వ్యక్తి 26/11 దాడుల్లో కీలకంగా వ్యవహరిచడం, గతంలో రెస్క్యూ ఆపరేషన్లు చేసిన వ్యక్తి కావడం విశేషం. అయితే టీమిండియాకు ఆ వ్యక్తిని ఎందుకు సెక్యురిటీ కోసం పంపుతున్నారన్నది ప్రశ్నగా మారింది. బ్రిగేడర్ గోవింద్ సిసోడియా ముంబై దాడుల్లీ కీలకంగా వ్యవహరించారు. ఎన్ఎస్జీ ఆపరేషన్ ను ఈయన ముందుండి నడిపించారు. కాగా ఆస్ట్రేలియాతో పాటుగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో టీమిండియా సిరీస్ లకు ఆయన నేతృత్వంలో సెక్యూరిటీ అరేంజ్ మెంట్స్ జగరనున్నాయని తెలుస్తోంది.

గోవింద్ సిసోడియా దిల్లీలోని ఎన్ఎస్జీలో డిఐజీ ట్రెయినింగ్ లో డిప్యుటేషన్ లో ఉన్నారు. ఈయనతో పాటుగా మనోజ్ అమిత్ భరద్వాజ్ అనే మరో అధికారిని కూడా టీమిండియా సెక్యురిటి నిమిత్తం నియమించనున్నారు. ఈయన కూడా కమాండో ఆపరేషన్ లో గోవింద్ సిసోడియాతో కలిసి పనిచేశారు. గోవింద్ సిసోడియా అజ్మల్ కసబ్ ను పట్టుకోవడంలో, కాశ్మీర్ లో ముష్కరుల వేటలో కూడా ఈయన కీలకంగా వ్యవహరించారు. అయితే ఇంతటి వ్యక్తిని టీమిండియా సెక్యురిటీ కోసం ఎందుకు పంపుతున్నారు అన్నది పలు అనుమానాలకు తావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Govind Singh Sisodia  Team India  Cricket  NSG  

Other Articles