Sensex tumbles 378 points, Nifty cracks 7,700 on China woes

Sensex tumbles 378 points nifty cracks 7 700 on china woes

Sensex , BSE Sensex, NSE Nifty, China, Shanghai shares, Share market, Stockmarket

The benchmark BSE Sensex extended losses on a fourth straight day as it fell by over 378 points while NSE Nifty dipped below the 7,700 level in early deals as further sell-off in China forced the market to halt trading for the second time this week. In addition, weakness in the rupee against the American currency too weighed on the sentiment. Asian markets were in deep red with Shanghai shares crashing 7.32 per cent, forcing authorities to suspend trading, less than half an hour after opening.

షేర్ మార్కెట్ ఢమాల్..!

Posted: 01/07/2016 11:15 AM IST
Sensex tumbles 378 points nifty cracks 7 700 on china woes

భారత షేర్ మార్కెట్ కు నేడు మరో బ్లాక్ మండే కానుందా..? చైనా ప్రభావం మనల్ని కుదేలు చేస్తుందా...? మదుపర్లకు నష్టాలు భారీగా వస్తాయా..? ఇలా నేటి ఉదయం షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ మొదలైనప్పటి నుండి వినిపిస్తున్న మాటలు. చైనా దెబ్బకు భారత షేర్ మార్కెట్టే కాదు.. చాలా దేశాల షేర్ మార్కెట్లు బేరుమంటున్నాయి.  చైనాలో షేర్లు ఒక్కరోజే 7శాతం నష్టపోవడంతో అక్కడ ట్రేడింగ్ను గురువారం మొత్తం సస్పెండ్ చేశారు. అనంతరం భారత్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కూడా నష్టాలతోనే మొదలయ్యాయి. ఉదయం 9.50 గంటల ప్రాంతానికి సెన్సెక్స్ 332.74 పాయింట్లు నష్టపోయి 25073.59 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 106.15 పాయింట్లు నష్టపోయి 7634.85 వద్ద ట్రేడవుతోంది.

చైనా ప్రభావం భారత మార్కెట్ల పైనే కాకుండా ఆసియా మార్కెట్లన్నింటిపై పడింది. జపాన్ మార్కెట్( నిక్కీ) 334 పాయింట్లు, హాంకాంగ్ మార్కెట్ (హాంగ్ సెంగ్) 501, సింగపూర్ మార్కెట్(స్ట్రేయిట్ టైమ్స్)57 పాయింట్ల నష్టాల్లో ట్రేవడవుతున్నాయి.ఈ వారంలోనే చైనాలో సెల్ఆఫ్ కారణంగా మార్కెట్లను నిలిపివేయడం ఇది రెండో సారి. మార్కెట్లు ప్రారంభమైన 30 నిమిషాలకే భారీగా పతనం దిశగా కొనసాగడంతో చైనా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిపివేశారు. గడచిన 25 ఏళ్లలో అతి తక్కువ సమయం చైనా మార్కెట్లు ట్రేడయింది ఈ రోజే. కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  25,861గా అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 24,180గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shoes factory in gachibowli
Indian economic growth beat chinas in feb hsbc survey  
Rate This Article
(0 votes)
Tags : Sensex  BSE Sensex  NSE Nifty  China  Shanghai shares  Share market  Stockmarket  

Other Articles