ISI sought to fish out defence phone numbers

Isi sought to fish out defence phone numbers

ISI, pakistan, Indian, Army, Soldiers, BSNL, Phone numbers of Amry personals

Defence establishments in Rajasthan have been advised not to share their contact details with any caller without proper verification. District police have alerted the defence officials to take measures and ask officials to be cautious in the wake of the recent attempts made by Pakistan Intelligence agencies to extract contact details of the defence establishments through internet calls.

ఆర్మీ వాళ్ల ఫోన్ నెంబర్ల కోసం పాక్ ప్రయత్నం

Posted: 01/05/2016 04:14 PM IST
Isi sought to fish out defence phone numbers

మొన్న ఫేస్ బుక్ ద్వారా ఇండియాకు సంబందించిన విషయాలను సేకరించిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మరోసారి భారత కీలక సమాచారం మీద కన్నేసింది. అందులో భాగంగా మొన్న ఎయిర్ మెన్ ను తమ వలలో వేసుకున్న పాకిస్థానీలు తాజాగా మరోసారి తమ కుట్రను భారత నిఘా వర్గాలు  బట్టబయలు చేసింది. రక్షణ శాఖకు చెందిన ఫోన్ నెంబర్లను సేకరించడానికి ఏకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసింది. వారు చాలా కాలంగా అదే పనిలో ఉన్నారని తాజాగా వెల్లడైంది. దీంతో, మరిన్ని దాడులకు పాక్ కుట్ర పన్నుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారత రక్షణ శాఖకు చెందిన అధికారులతో పాటు ఉద్యోగుల ఫోన్ నెంబర్లను కూడా సేకరించడానికి ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్మీ అధికారులు, ఉద్యోగుల ఫోన్ నెంబర్లు ఇటీవల మారిపోయాయి. గత ఏడాది సెప్టెంబర్ లో రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో వార్ ఎక్సర్ సైజ్ జరిగింది. అప్పుడు ఆర్మీ సిబ్బంది ల్యాండ్ ఫోన్ నెంబర్ల కోసం ఐఎస్ఐ ఏజెంట్లు పాకిస్తాన్ నుంచి BSNL సిబ్బందికి ఫోన్లు చేశారు. ఐఎస్ఐ ఏజెంట్లు చాలా తెలివిగా BSNL ఎకౌంట్స్ విభాగానికి ఫోన్లు చేశారు. ఆర్మీ అధికారులు, ఉద్యోగుల ఫోన్ బిల్లుల వివరాలు అడిగారు.

కాగా వారు పాకిస్తాన్ నుంచి కాల్ చేసినా, అది ఢిల్లీ నుంచి వచ్చినట్టు రికార్డ్ అయింది. ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, అనుమానం వచ్చి ఆరా తీస్తే అది పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్ అని తేలిపోయింది. అయితే, కాల్ వచ్చింది పాక్ నుంచి అని తెలియని ఓ ఉద్యోగి మాత్రం ఒకటి రెండు నెంబర్లను వారికి తెలిపాడు. ఇప్పటికీ ఐఎస్ఐ ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విషయం తెలిసిన ఆర్మీ, BSNL అధికారులు అలర్ట్ అయ్యారు. ఆర్మీకి చెందిన వారెవరూ తమ కాంటాక్ట్ వివరాలను ఎవరికీ తెలపవద్దని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISI  pakistan  Indian  Army  Soldiers  BSNL  Phone numbers of Amry personals  

Other Articles