huge-fire-erupts-at-dubai-hotel-near-burj-khalifa

Dubai fireworks celebration goes off despite massive hotel blaze that injured 16

fire, hotel fire, Dubai, Address Downtown, Fireworks display, New Years Eve, Burj Khalifa, Dubai, New year elebrations, fire accident, international news, world news, foreign news

Dubai's glitzy New Year's Eve fireworks show went on as planned even as a massive fire engulfed the exterior of the Address Downtown Hotel nearby -- sending flames shooting into the sky.

నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.. ఎగిసిపడిన అగ్నికిలలు..

Posted: 01/01/2016 10:58 AM IST
Dubai fireworks celebration goes off despite massive hotel blaze that injured 16

నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్యకేంద్రంగా ప్రఖ్యాతి చెందిన  యూఏఈలో (యూనైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్) ఎత్తై బుర్జ్ ఖలీఫా ఆకాశ హర్మ్యం సమీపంలోని 63 అంతస్తుల అడ్రస్ డౌన్‌టౌన్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్‌లో 20వ అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు. ఆ మంటలు హోటల్ వెలుపలి వైపు నుంచి 40వ అంతస్తు వరకూ పైకి ఎగసిపడుతున్నాయి. దీంతో హోటల్ పై అంతస్థుల నుంచి దాదాపు 300 మీటర్ల ఎత్తు నుంచి శకలాలు కిందకు పడుతున్నాయి. ఈ హోటల్‌లో నివాస గదులు (రెసిడెన్షియల్ రూమ్స్) కూడా ఉన్నాయి.

కొత్త సంవత్సరం వేడుకల కోసం.. పెద్దమొత్తంలో టపాసులను భవనంపైకి తీసుకు వెళ్లినట్లు చెప్తున్నారు. మంటలు మొదలైన వెంటనే గుర్తించి హోటల్‌లోని అందరినీ ఖాళీ చేయించటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అయితే మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా బయటకు రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 14 మందికి చిన్న గాయాలు కాగా, ఓ వ్యక్తికి గుండె పోటు వచ్చినట్టు అధికారులు చెప్పారు. హోటల్ లోపలి వైపు మంటలు విస్తరించలేదని అధికారులు పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Burj Khalifa  Dubai  New year elebrations  fire accident  

Other Articles