Obama most popular leader in world and PM Modi seventh

Obama most popular leader in world and pm modi seventh

Modi, Obama, International World Leader Index, ORB International's

Prime Minister Narendra Modi has been voted as the seventh most popular leader in the world in a new poll topped by US President Barack Obama. Modi evoked a favourable view from 24 per cent of people polled throughout 65 countries around the world as opposed to 20 per cent unfavourable, giving him a score of +4 per cent in the WIN/Gallup survey for ORB International's 'International World Leader Index'.

ఫస్ట్ ఒబామా.. మోదీకి ఏడో ర్యాంక్

Posted: 12/24/2015 04:07 PM IST
Obama most popular leader in world and pm modi seventh

ప్రపంచ దేశాలలో అత్యంత పాపులర్ నేతగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ జాబితాలో ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఓఆర్ బీ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఈ సర్వేలో 24 శాతం మంది మోదీకి అనుకూలంగా ఓటు వేశారు. ఓఆర్ బీ ఇంటర్నేషనల్ 'ఇంటర్నేషనల్ వరల్డ్ లీడర్ సూచిక' విన్/గాలప్ సర్వేలో మోదీకి ప్లస్ 4 శాతం ఓట్లేశారు. మోదీకి వ్యతిరేకంగా 20 శాతం ఓట్లు పోలవ్వడం గమనార్హం. ప్రధాని మోదీని వెనక్కి నెడుతూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ 30 శాతం ఓట్లతో ఆరో స్థానంలో నిలిచారు. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఒబామాకు అనుకూలంగా 59 శాతం ఓట్లు రాగా, ఆయనను వ్యతిరేకిస్తూ 29 శాతం ఓట్లు పోలవడం వార్తల్లో నిలిచింది. రెండో స్థానంలో ప్లస్ 13 శాతంతో జర్మనీ చాన్స్ లర్ ఎంజెలా మోర్కెల్ నిలిచారు.

బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్లస్ 10 శాతం ఓట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించారు. ఆయనకు 37 శాతం ఓట్లు రాగా, ఈ ఓట్లలో దక్షిణాసియా దేశాల నుంచే 57 శాతం ఓట్లు వచ్చాయని సమాచారం. ఈ జాబితాలో వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండే, రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ (8), సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ అసద్ (9), ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ (10)లు కూడా ప్రజాదరణ పొందుతున్న నేతలలో స్థానం సంపాదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Obama  International World Leader Index  ORB International's  

Other Articles