Konatala Ramakrishna brought alligations in Vishaka TDP

Konatala ramakrishna brought alligations in vishaka tdp

TDP, Chandrababu, Konatala Ramakrishnudu, YSRCP, Ganta Srinivas, Ayyana Patrudu

Konatala Ramakrishna brought alligations in Vishaka TDP. Minister Ganta opposing Konatala joing but Ayyana patrudu getting ready to join him.

గంటకు ఇష్టంలేదు.. అయ్యన్న మాత్రం వినడం లేదు

Posted: 12/22/2015 03:49 PM IST
Konatala ramakrishna brought alligations in vishaka tdp

ఏపీలో రాజకీయాలు రసకందాయంగా మారాయి. జగన్‌ను వెన్నంటి ఉన్న కొణతాల రామకృష్ణ వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వైసీపీ నేతలు కొణతాల, గండి బాబ్జీ టీడీపీలో చేరేందుకు సర్వంసిద్ధం చేసుకున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. కళా వెంకట్రావ్, మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఏసీ సీఎం చంద్రబాబును కొణతాల కలిశారు. అయితే కొణతాల, బాబ్జీ రాకను మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరి చేరిక టీడీపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. కాగా కొణతాల రామకృష్ణ, ఆయన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఈ ఉదయం సీఎం చంద్రబాబును కలిసారు. మంత్రి అయ్యన్నపాత్రుడు దగ్గరుండి మరీ వారిని సీఎం వద్దకు తీసుకెళ్లారు.

కొణతాల రామకృష్ణ చేరికతో టీడీపీ బలం మరింత పెరుగుతుందని ఏపీ అటవీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కొణతాల కేడర్ ఉన్న నాయకుడు అన్న అయ్యన్నపాత్రుడు.. సంక్రాంతి తర్వాత తన అనుచరులతో కలిసి ఆయన టీడీపీలో చేరతారని చెప్పారు. నమ్మకస్తులు ఎవరైనా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మంత్రి అయ్యన్న స్పష్టం చేశారు. కాగా కొణతాల చేరికకు పార్టీ అధినేత చంద్రబాబే ఆమోదం తెలిపిన తర్వాత, పార్టీలోని ఎవరూ వ్యతిరేకించేది ఉండదని ఆయన తేల్చి చెప్పారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారని మంత్రి వెల్లడించారు. కొణతాల, గండి బాబ్జీ చేరికతో స్థానికంగా విభేదాలు వస్తాయని అనుకోవడం లేదన్నారాయన. వ్యక్తిగతంగా తనకు, ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విభేదాలున్నా కలిసి పని చేస్తున్నామని మంత్రి అయ్యన్న వ్యాఖ్యానించారు. కాగా దాడి వీరభద్రరావు తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు సుముఖంగా లేరని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Chandrababu  Konatala Ramakrishnudu  YSRCP  Ganta Srinivas  Ayyana Patrudu  

Other Articles