Man jumps into tiger enclosure at China zoo

Man jumps into tiger enclosure at china zoo

Zoo, China Man, Man jumps into tiger enclosure, China Zoo

A man had to be rescued from a tiger enclosure at a zoo in central China after jumping into the feline compound to practice a "somersault."Security footage aired on China Central Television (CCTV) first shows the man calmly sitting in a cable car at a zoo in Henan Province before deciding it would be a good time to put his gymnastic capabilities to the test.

ITEMVIDEOS: కిక్ కోసం పులుల ముందుకు దూకాడు

Posted: 12/22/2015 10:50 AM IST
Man jumps into tiger enclosure at china zoo

కిక్ కోసం ఎంతైనా చెయ్యడానికి కొంత మంది సిద్దంగా ఉంటారు. కిక్ లేకుండా లైఫ్ లో ధ్రిల్ ఏముంది అని వాళ్ల పాలసీ. కిక్ కోసం లైఫ్ ని రిస్క్ లో పెట్టే వాళ్లు చాలా తక్కువ ఉంటారు. అయితే తాజాగా ఓ చైనా వ్యక్తి కిక్ అతడిని రాత్రికిరాత్రే వార్తల్లో వ్యక్తిగా మార్చింది. కానీ అతడి తిక్క వేషం గురించి తెలిసిన వాళ్లు మాత్రం వాడికి కాస్త తిక్కుంది. దానికి లెక్కలేదని అనుకుంటున్నారు. ఇంతకీ మనోడు చేసిన కిక్కిచ్చే పనేంటో తెలుసా.??? పులులు ఉండే ఏరియాలోకి దూకడం. అవును లైఫ్ ని డేంజర్ లో పడేసే అతగాడి కిక్ గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

కిక్ కోసం సినిమాలో ఓ హీరో ఏదైనా చేయడం చూసే ఉంటారు కానీ ఓ వ్యక్తి థ్ల్రిల్, కిక్ కోసం, ఏకంగా పులులు ఉండే జోన్‌లో దూకి సాహసం చేసిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనా‌లోని ఓ జంతు ప్రదర్శన శాలకు వెళ్లిన 40 ఏళ్ల వ్యక్తి రోప్‌వేలో పులల ఎన్‌క్లోజర్ మీదుగా వెళ్తూ అక్కడ దూకేశాడు. అయితే అదృష్టం బాగుండి దానిపై ఓ నెట్‌ ఉండటంతో బతికిపోయాడు. అప్పటికి కింద నుండి పులి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో అక్కడి సిబ్బంది గమనించి సదరు వ్యక్తిని రక్షించారు. ఇంతా కష్టపడి వారు కాపాడి ఎందుకిలా చేశారు అంటే కిక్ కోసం చేశానని సమాధానం చెప్పాడట. పైగా తాను సరిగా దూకలేదని కూడా బాధ పడ్డాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zoo  China Man  Man jumps into tiger enclosure  China Zoo  

Other Articles