Chandrababu Naidi do you have answer

Chandrababu naidi do you have answer

Chandrababu, AP, Call Money, Cash for Vote, Chandrababu Naidu, Cheap Liquior, Chandrababu on call money

Chandrababu Naidi do you have answer. After Chandrababu Naidu as the Chief Minister of the AP, Many contraversies rised.

చంద్రబాబు.. మీ దగ్గర ఆ జవాబు ఉందా..?

Posted: 12/21/2015 11:52 AM IST
Chandrababu naidi do you have answer

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రం అభివృద్ది బాట సంగతి ఏమో కానీ రకరకాల వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. అమరావతి నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు తెలుగు వారి కీర్తి పతాకాలను ఎగరవేస్తాడని అనుకుంటే.. అలా కాకుండా వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. అవినీతిని ఏమాత్రం సహించను... అక్రమాన్ని అడ్డుకుంటాను అని సినిమా డైలాగులు వల్లెవేసే చంద్రబాబు వాటిని పాటించడంలో మాత్రం ఎటో చివరలో కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వివాదాలు చంద్రబాబు నాయుడుతో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో సంబందం ఉన్నవే.

ఓటుకు నోటు వ్యవహారం దగ్గరి నుండి నేటి కాల్ మనీ వరకు అన్నింటా తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం.. వారి వెనక చంద్రబాబు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నట్లు దాదాపుగా బట్టబయలైంది. అయితే కాల్ మనీ వ్యవహారంలో మాత్రం చాలా మంది చంద్రబాబు వైఖరిని తప్పుబడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం కాల్ మనీ వ్యవహారంలో వ్యహరిస్తున్న తీరు.. అసెంబ్లీలో అధికార పార్టీ తీరు.. విపక్షాలకు కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా వ్యవహరిన వైనం మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కాల్ మనీ వెనక ఎవరు ఉన్నా.. ఎంత మంది ఉన్నా వారిని మాత్రం వదిలేదిలేదని రొటీన్ గా ప్రకటన చేశారు.

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని వెనకుండి నడిపించి ఎవరు అన్న దానికి ఇప్పటి దాకా సమాధానం లేదు. కాగా ఈ కేసుతో రెండు రాష్ట్రాల మధ్య పోరు ఉద్రిక్తమైందా అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఓటుకు నోటులో చంద్రబాబు నాయుడు ఎలాంటి జోక్యం లేకపోతే.. ఎందుకు ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలవాల్సి వచ్చింది అన్న దాని మీద క్లారిటీ ఆయన మాత్రమే ఇవ్వగలరు. అయితే దీని మీద ఆయన ఎలాంటి ప్రకటన కానీ క్లారిటీ కానీ ఇవ్వలేదు.

ఇక అట్టహాసంగా నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో 35 మంది భక్తులు చనిపోయారు. అయితే దీనికి వెనక అసలు కారణం అన్న దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. షూటింగ్ కోసమే వేల మంది భక్తులను ఇబ్బంది పెట్టారు అన్నదాని మీద చంద్రబాబు సరిగ్గా వివరణ కూడా ఇవ్వలేదు. విఐపి ఘాట్ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు మామూలు ఘాట్ వచ్చారు..? అలా రావడం వల్లే అంత మంది చనిపోయారు.. అవునా కాదా..? అన్న దాని మీద చంద్రబాబు సైలెన్స్ దానికి జవాబు కాదు.

నాగార్జున యూనివర్సిటీలో వేధింపులు భరించలేక.. ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన చావుకు కారణాలను కూడా వివరించింది. అయితే రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు కూడా ఉన్నరన్న దాని మీద చంద్రబాబు సర్కార్ సీరియస్ గా వ్యవహరించలేదు. కంటి తుడుపు చర్యలుగా నాలుగు రోజులు హడావిడిచేసి.. ర్యాగింగ్ ను అరికడతాం అంటూ ప్రకటన చేశారు. ఇక రాష్ట్రంలో పెరిగిపోయిన ఇసుక, లిక్కర్ మాఫియా మీద కూడా చంద్రబాబు నాయుడు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు ఇలా ఉండడానికి కారణాలు కూడా ఉన్నాయంటూ అప్పుడే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారితో సంబందం ఉన్న వాటి మీద ప్రభుత్వం కఠినంగా ప్రవర్తించకూడదని ముందే సూచనలు అందినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేసిన వారి మీద కఠినంగా, వేగంగా చర్యలకు దిగలేకపోతోందని కూడా అంటున్నారు. మరి చూడాలి కాల్ మనీ వ్యవహారంలో కూడా అదే జరుగుతుందా లేదా అని. కాల్ మనీలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కొంత మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాల్ మనీని కూడా గతంలో వచ్చిన వివాదాల మాదిరిగా కనుమరుగు చేస్తారా..? లేదంటే నిజాయితీగా వ్యవహరించి అసలు దోషులను చట్టం ముందు దోషిగా నిలబెడతారా..? చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles