DDCA rubbishes allegations against FM Arun Jaitley

Ddca rubbishes allegations against fm arun jaitley

AArun Jaitly, Arun Jaitly On DDCA, AAP, AAP on Arun Jaitly, The Delhi and District Cricket Association, Delhi

The Delhi and District Cricket Association (DDCA) today strongly refuted allegations of financial irregularities against Finance Minister Arun Jaitley, saying that such charges were absolutely rubbish.

అరుణ్ జైట్లో మీద ఆప్ ఆరోపణలు.. మాటల యుద్దం

Posted: 12/18/2015 08:36 AM IST
Ddca rubbishes allegations against fm arun jaitley

దిల్లీలో చలి చంపేస్తోందని రోజూ వార్తలు వస్తున్నాయి... కానీ అక్కడ రాజకీయ వేడి గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఆ వార్తలను నమ్మరు. ఎందుకంటే ఒకరి మీద మరొకరు దుమ్మెత్తేసుకుంటూ. రాజకీయ వేడి రగిలిస్తున్నారు. దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో ఆర్థిక అవకతవకలపై బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతుతోంది. అరుణ్ జైట్లీ హయాంలో డీడీసీఏ అవినీతికి కేం ద్రంగా మారిందని ఆప్ ఆరోపించింది. అదంతా అస త్య ప్రచారమని, 2013లో తాను వైదొలగిన తర్వాత డీడీసీఏలో లావాదేవీలపై తననెలా బాధ్యుడ్ని చేస్తార ని జైట్లీ వ్యాఖ్యానించారు.

ఆప్ ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తిప్పికొట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే తనను అపకీర్తి పాల్జేసేందుకు అస త్య ప్రచారం చేస్తున్నారని గురువారం జైట్లీ తన బ్లాగ్ లో రాశారు. తాను ఏ బాధ్యతలు నిర్వర్తించినా ఉన్న త ప్రమాణాలు పాటించానని పేర్కొన్నారు. ఇంతవరకు తానెప్పుడూ వ్యక్తిగత ఆరోపణలు చేయకపోయినా.. ఇప్పుడు ఆ అవసరం వచ్చిందని మీడియా తో అన్నారు. ఢిల్లీ సీఎంకు మద్దతు పలికిన పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌లనూ జైట్లీ తప్పు బట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles