if floods occur does this house has any threat, kcr ask chandrababu

Kcr typical question to chandrababu

KCR question to Chandrababu, KCR typical question to chandrababu, chandrababu special lunch for kcr, pure andhra dishes at telugu cms lunch, menu card of telugu chief ministers lunch, KCR invites Chandrababufor Chandi Yagam, kcr chandi yagam, chandrababu, kcr, chief ministers, telugu states, special lunch

Telangana CM KCR asked a typical question to AP CM Chandrababu Naidu after invitint him for Chandi Yagam, which is yet to be perform at his farmhouse on December 23rd to 27th.

నది పక్కనే ఇళ్లా..? వరదలోస్తే..? కేసీఆర్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం..?

Posted: 12/15/2015 08:55 AM IST
Kcr typical question to chandrababu

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబునాయుడుల మధ్య నిన్న విజయవాడలో బోజన సమయంలో ఆసక్తికర చర్చ జరిగింది. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 నుంచి చేపట్టనున్న అయుత చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్.. విజయవాడకు వెళ్లి చంద్రబాబును అహ్వానించిన అనంతరం జరిగిన బోజన కార్యక్రమాలలో కేసీఆర్ తన మనస్సులో వున్న ప్రశ్నను చంద్రబాబు వద్ద అడిగేశారు. అయితే అందరికీ వచ్చే అనుమానమే కేసీఆర్ ప్రశ్నలోనూ ఉత్సన్నమవ్వడంతో ఆయన ప్రశ్నకు చంద్రబాబు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారట.

ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది.. ‘‘ అన్నా! నేను హెలికాప్టర్లో వస్తూ చూశాను. మీ ఇంటి వద్ద నదిలో నీళ్లు నిండుగా ఉన్నట్లు అనిపించింది. ఈ కాలంలోనే ఇలా ఉంటే, వరదలు వచ్చినప్పుడు మీ ఇల్లు మునగదా? వరదలు వచ్చినప్పుడు రాజధాని ప్రాంతానికి ఇబ్బంది లేదా?’’ అని చంద్రబాబును కేసీఆర్ అడిగారు. ఈ ప్రశ్నలకు ఓ చిరునవ్వు నవ్విన చంద్రబాబు ‘‘పైనుంచి చూస్తే నది నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, అది నిజం కాదు.

వీటీపీఎస్ ధర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం నదిలో ఆ నీటిమట్టం నిర్వహిస్తుంటారు. లేకపోతే వీటీపీఎస్ ఆగిపోతుంది. రాజధాని ప్రాంతానికి కూడా ఇబ్బంది లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్నాం. వందేళ్లలో వచ్చిన వరదల లెక్కలు తీసి, అంతకు 50 శాతం అధికంగా వరద వచ్చినా సమస్య రాకుండా జాగ్రత్త పడుతున్నాం’’ అని సమాధానమిచ్చారు. చంద్రబాబు చెప్పిన సమాధానాన్నివిన్న కేసీఆర్, కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  kcr  chief ministers  telugu states  typical question  

Other Articles