This is the invitation card for the KCRs Chandiyagam

This is the invitation card for the kcrs chandiyagam

invitation, Invitation cardchandi yagnam, kcr, telangana, chandrababu naidu, Personally invited, AP CM, Tdp, TRS, invites CBN, Chandiyagam

Telangana cm KCR inviting Vips and Vvips for his Ayatha Chandi Yagam. The invitation card reveled in media

కేసీఆర్ ఛండీయాగం పత్రిక ఇదే..

Posted: 12/13/2015 02:37 PM IST
This is the invitation card for the kcrs chandiyagam

ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో విశ్వశాంతి కాంక్షిస్తూ, తెలంగాణలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు తొలగిపోవాలని ఆశిస్తూ.. చేపడుతున్న ఆ మహత్‌ కార్యమే ఆయుత చండీ యాగం.. ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు సిద్ధం అయిపోయాయి. వీటిని వీవీఐపీలకు అందివ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కేవలం ప్రముఖులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు సీఎం సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు నాయుడుకు భార్యాసమేతంగా వెళ్లి కేసీఆర్‌ స్వయంగా ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా.. విజయవాడలో దుర్గ గుడిలో మెక్కు చెల్లించనున్నారు.

ఆయుత చండీయాగం ధార్మిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ఫామ్ హాజ్‌ పరిసర ప్రాంతాలు వేదిక కాబోతున్నాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు ఐదురోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. దేవుడిపై అపార విశ్వాసం కలిగిన కేసీఆర్... ఇప్పటికే ఎన్నో యజ్ఞయాగాదులు చేసినప్పటికీ... ఇప్పటివరకెప్పుడూ చేయనిది ఆయుత చండీయాగం. ఈ యాగం చేయాలంటే దృడ సంకల్పమే కాదు.. పరమ పవిత్రంగా , నిష్టా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఏ మాత్రం లోపం జరగకుండా అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అందుకే ఈ యాగాన్ని సంకల్పించేందుకు ఎవరూ అంతగా ముందుకు రారు. కానీ విశ్వశాంతిని కాంక్షించిన సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో .. ఈ యాగానికి పూనుకున్నారు.

సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా చేపట్టిన ఈ యాగానికి... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. దీంతో యాగశాలలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రణబ్‌తో పాటు ఆయన సంబంధీకులు కూర్చునేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావులను ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి ఆహ్వానించనున్నారు. వీరికే కాకుండా మరికొందరు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానపత్రాలు వెళ్లాయి. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles