TDP Stalwart vijayarama rao joins trs, despite chandrababus call

Despite chandrababu s phone call tdp stalwart joins trs

Chandrababu, TDP, TRS, vijayarama rao, ktr, kcr, it minister, panchayati raj minister, minister ktr, ghmc polls, hyderabad politics, former minister kvr,

Senior Telugu Desam Party (TDP) leader, former minister K Vijayarama Rao all but joined the Telangana Rashtra Samithi (TRS) on Saturday. He had resigned from the TDP

త్వరలోనే టీఆర్ఎస్ గూటికి.. పార్టీ కార్యకర్తలు నిర్ణయం మేరకే..

Posted: 12/12/2015 05:02 PM IST
Despite chandrababu s phone call tdp stalwart joins trs

టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కె. విజయరామారావు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ శనివారం విజయరామారావును కలిసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తనను ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపిన విజయరామారావు.. రెండు మూడు రోజుల్లో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రెండుమూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు.

కాగా, విజయరామారావు కుమార్తె అన్నపూర్ణకు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. విజయరామారావు నిన్ననే టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం తర్వాత విజయరామారావు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఇవాళ రాత్రికి ఆయన ఇంటికి తెలంగాణ టీడీపీ నేతలు వెళ్లి మరోమారు బుజ్జగించే చర్యలను చేపట్టనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  TDP  TRS  vijayarama rao  ktr  kcr  

Other Articles