Medak court sentences 2-Year Jail Term for TRS MLA

Will approach high court on 2 year jail term saystrs mla

TRS MLA Gudem Mahipal Reddy, Patancheru constituency, Medak district, Mahipal Reddy imprisonment, Mahipal Reddy criminal intimidation, Additonal judicial firstclass magistrate D Durgaprasad, fine of `2,500, Mahipal Reddy filthy language, Mahesh, Versatile industry, Pashamailaram IDA, Chandu Kumar, BDL police station, Mahipal Reddy forcefully cheque of Rs 15 lakh, court granted time for bail.

TRS MLA Gudem Mahipal Reddy, representing Patancheru constituency in Medak district, was sentenced to two years imprisonment in a case of criminal intimidation by Additonal judicial firstclass magistrate D Durgaprasad

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలుశిక్ష.. హైకోర్టును ఆశ్రయిస్తా..

Posted: 12/11/2015 03:36 PM IST
Will approach high court on 2 year jail term saystrs mla

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పటాన్ చెరు పరిధి పాశ మైలారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ యాజమాన్యంపై ఎమ్మెల్యే దాడి చేశారని కేసు నమోదైంది.

తాను ఎమ్మెల్యే కాకుముందు నమోదైన కేసులో ఆయన తన 70మంది అనుగచర గణంతో వచ్చి తనను బెగిరించి, దుర్భాషలాడి.. 15 లక్షల రూపాయల మేర చెక్కును బలవంతంగా రాయించుకుని తీసుకెళ్లి, బాధిత కుటుంబసభ్యులకు ఇచ్చాడని పరిశ్రమ యజమాని చందుకుమార్ పిర్యాదు నమోదు చేశారు. దాన్ని విచారించిన మేజిస్ట్రేట్, మహిపాల్ ను దోషిగా నిర్ధారించారు. ఇందుకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించారు.

తాజాగా కోర్టు తీర్పుపై ఎమ్మెల్యే స్పందిస్తూ, కోర్టు తీర్పును తాను గౌరవిస్తానన్నారు. కోర్టు ఇచ్చిన గడువు మూడు రోజుల్లోగా పైకోర్టుకు వెళతానని చెప్పారు. కార్మికుడికి ఇచ్చిన చెక్కును ఎగ్గొట్టేందుకే పరిశ్రమ యజమాని తనపై కేసు పెట్టాడని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం కోరితేనే ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పరిశ్రమకు వెళ్లి నష్టపరిహారం ఇప్పించానని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS MLA  Mahipal reddy  court  imprisonment  fine  bail  

Other Articles