Four-year-old dancer 'Heaven King' takes YouTube crown

Heaven king s watch me moves top youtube s trending cha

Heaven King,Tianne King,Heaven on Ellen,Silento,Watch Me Dance On,#WatchMeDanceOn,Four-year old dancer,Watch Me Whip,Nae Nae,Watch Me Nae Nae

A video of four-year-old dancer known as Heaven King, sometimes called a "mini Beyonce," was the most viewed item of the year on YouTube, the Google-owned service said.

ITEMVIDEOS: ఈ చిన్నారి డాన్స్ వీడియో యూట్యూబ్ లో టాఫ్..

Posted: 12/10/2015 01:26 PM IST
Heaven king s watch me moves top youtube s trending cha

మినీ బియాన్స్'గా పేరొందిన నాలుగేళ్ల  చిన్నారి తన అద్బుత డాన్స్ షోతో ఈ ఏడాది యూట్యూబ్‌ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. అదరిపోయే స్టెప్పులతో ఈ చిన్నారి చేసిన డ్యాన్స్ వీడియో 2015 సంవత్సరంలో అత్యధిక వ్యూస్‌ సాధించింది. ర్యాపర్ సైలెంటో పాడిన 'వాచ్‌ మి' పాటకు న్యూయార్క్ వీధుల్లో ఈ బుజ్జాయి వేసిన స్టెప్పులకు వీక్షకుల నుంచి స్పందన కూడా అదరహో అనే స్తాయిలోనే వుంది. 'హేవన్‌ కింగ్‌'గా పేరొందిన ఈ చిన్నారి డ్యాన్స్ వీడియోను ఇప్పటివరకు 116 మిలియన్ల (16.6 కోట్ల) మంది చూశారని, ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన వీడియో ఇదేనని గూగుల్ నేతృత్వంలోని యూట్యూబ్‌ ప్రకటించింది.

ఇక రెండోస్థానంలో నటుడు లియాన్ నీసన్ నటించిన 'క్లాష్ ఆఫ్ క్లాన్స్' వీడియో గేమ్‌ నిలిచింది. దీనిని 83 మిలియన్ల (8.3 కోట్ల) మంది చూశారు. 'హేవన్ కింగ్' చిన్నారి వీడియో పోల్చుకుంటే రెండోస్థానంలో ఉన్న వీడియోకు సగం వ్యూస్‌ కూడా రాకపోవడం గమనార్హం. యూట్యూబ్ ప్రముఖుడిగా పేరొందిన ప్రంక్‌స్టర్ రోమన్ అట్వూడ్ తీసిన 'క్రేజీ ప్లాస్టిక్ బాల్' వీడియో మూడోస్థానంలో నిలించింది. దీనిని 56 మిలియన్ల (5.6 కోట్ల) మంది వీక్షించారు. యాడ్ కౌన్సిల్ జారీచేసిన 'లవ్ హజ్ నో లేబుల్', జస్టిన్ బీబర్ వీడియో, డెలవేర్ పోలీసులు పెట్టిన 'కన్ఫెషనల్' వీడియో టాప్‌ వీడియోల్లో చోటుసంపాదించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heaven  king:  5 year old  youtube video  canada  

Other Articles