congress enjoys first victory over ruling trs

Ruling trs experiences first defeat in ramagudem

Ramagundam muncipal corperation elections, congress victory, TRS defeat, ramagundam fourth division results, TRS defeat in ramagudem, dasari savitri, sneha, ramagundam, municipal elections, congress, TRS,

Ramagundam muncipal corperation elections bring happiness to congress party as it won first victory over ruling TRS party in fourth division

టీఆర్ఎస్ కు తొలి ఓటమి.. కాంగ్రెస్ కు తొలి విజయం..

Posted: 12/10/2015 01:23 PM IST
Ruling trs experiences first defeat in ramagudem

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తరువాత జరిగిన ప్రతీ ఎన్నికలో జెండాను ఎగురవేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న అధికార  తెలంగాణ రాష్ట్ర సమితికి రామగుండం ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు ప్రజలు తమ వైపు వున్నారని చెబుతూ వచ్చిన అధికార పార్టీ నేతలు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.. పార్టీ అవిర్భవం జరిగిన కరీంనగర్ జిల్లాలోనే తొలిసారిగా చుక్కెదురు కావడంతో పార్టీ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు. కాగా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. ఇక్కడి నుంచి అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని వారు జోస్యం చెబుతున్నారు.

ఇంతకీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరానికి కారణమేంటో తెలుసా..?. కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిచింది.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దాసరి సావిత్రి తన ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిని స్నేహపై 167 ఓట్ల ఆధిక్యంతో కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం. తమ అభ్యర్థిని విజయం సాధించడంతో రామంగుండం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. నేతలు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramagundam  municipal elections  congress  TRS  dasari savitri  

Other Articles