A situation that called for extraordinary steps

A situation that called for extraordinary steps

chennai, floods, tamilnadu, Chennai floods, Chennai flood effect, Chennai City

As rains lashed many parts of Tamil Nadu, huge tracts of densely populated areas became completely inaccessible floating islands. As power was switched off to avoid large-scale electrocution, mobile towers, basic telephony networks and internet cables too went kaput, making all forms of communication impossible. So, inaccessible and incommunicado are two words that best described the plight of most people in the State over those scary three to four days. If we add a couple of more words such as apathy, ineptitude and political complicity to the list, we would have well summed up the conduct of the State administration, both pre- and post The Great Tamil Nadu Floods.

కోలుకుంటున్న చెన్నై

Posted: 12/07/2015 08:33 AM IST
A situation that called for extraordinary steps

రోజుల తరబడి వరదల్లో చిక్కుకున్న చెన్నై నగరం క్రమంగా తేరుకుంటున్నది. ఆదివారం నగర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నా రైలు, విమాన సర్వీసులు, కమ్యూనికేషన్ వ్యవస్థలను పాక్షికంగా పునరుద్ధరించారు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో మరో 24 గంటల నుంచి 48 గంటల వరకు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ ప్రకటనతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. త్రివిధ దళాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు పూర్తిస్థాయి సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు వర్షాల వల్ల చెన్నై నగరంలో మృతి చెందిన వారి సంఖ్య 450 మందికి చేరుకున్నది.

కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు బస్సు సర్వీసులు పునః ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి రైలు సర్వీసులను పునరుద్ధరిస్తామని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ప్రకటించారు. తాజా వర్షాల వల్ల చెన్నైతోపాటు కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల పరిధిలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇక వివిధ రుణాలు తీసుకున్న వినియోగదారులు తమ నెలవారీ రుణ వాయిదాల చెల్లింపుల్లో జాప్యంపై పెనాల్టీ వసూలు చేయరాదని ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు నిర్ణయించాయి. ఏటీఎంలలో నగదు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. అస్తవ్యస్థ పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరతతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. తాగునీళ్ల బాటిల్ ధర రూ.50 నుంచి రూ.100 పలుకుతున్నది. పాల సరఫరా మెరుగైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chennai  floods  tamilnadu  Chennai floods  Chennai flood effect  Chennai City  

Other Articles