AP CM Candrababu naidu will appoint a commission for Kapu Reservation

Ap cm candrababu naidu will appoint a commission for kapu reservation

Kapu reservations, Kapu, AP, Chandrababu Naidu, Chandrababu, Kapu Commission, Funds for Kapu development

Chandrababu Naidu told to give reservations to Kapu Group. After a laong peroid Chandrababu will point a commission and it will give report with in nine months

ఏపిలో కాపుల రిజర్వేషన్లకు రంగం సిద్దం..!

Posted: 12/01/2015 08:27 AM IST
Ap cm candrababu naidu will appoint a commission for kapu reservation

ఏపిలో కాపు రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్‌ అయింది.. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో హైకోర్టు రిటైర్డు జడ్జి నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిషన్‌లో చైర్మన్‌తో పాటు 10 నుంచి 15మంది సభ్యులను నియమించాలని భావిస్తోంది.. కమిషన్‌ 9 నెలలలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం బీసీ రిజర్వేషన్‌ ను ప్రకటించేందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం రూపొందిస్తుంది.. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ఏకగ్రీవంగా తీర్మా నించింది. కమిషన్‌కు ప్రస్తుతం కేటాయించిన 100 కోట్ల బడ్జెట్‌ పూర్తయిన తరువాత అవసరాలను బట్టి మరిన్ని నిధులు కేటాయించాలని సమావేశం నిర్ణయించింది.

ఇతర రాష్ట్రాలు, కర్నాటక , తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలలో 50 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని, రాజస్థాన్‌ ఇంకా పరిశీలన జరుపుతోందని, ఆంధ్రప్రదేశ్‌ లో అమలులో ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి అవరోధాలులేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, నారాయణ, పల్లె రఘునాధరెడ్డి మీడియాకు వివరించారు. ఈ విషయంలో ఇతర బలహీన వర్గాలు అపోహలకు గురికావద్దని కోరారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles