Someone Just Booked Aamir Khan And His Familys Tickets To Pakistan

Someone just booked aamir khan and his familys tickets to pakistan

Amir Khan, pakistan, ntolerance, India, Amir Khan contraversial statments, HIndu Sena, Pakistan Flight tickets, Amir Khan News, Mamata Benerjee, Hruthick Roshan

We told you how Shiv Sena is telling people to slap Aamir Khan in return of 1 Lakh Rupees. As if this was less disgusting, something more disgraceful has just happened. A group called Hindu Sena has claimed to have booked tickets for Aamir, Kiran Rao and his son Azaad!

అమీర్ కు పాకిస్థాన్ విమాన టికెట్లు

Posted: 11/27/2015 08:39 AM IST
Someone just booked aamir khan and his familys tickets to pakistan

అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమిర్ కుటుంబం మొత్తం పాకిస్థాన్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్కయ్యాయి. ఆమిర్ ఖాన్, ఆయన భార్య, కొడుకు కోసం నవంబర్ 30న పాక్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ అయ్యాయని, వాటిని హిందూసేన బుక్ చేసిందని ఢిల్లీకి చెందిన ఓ పాత్రికేయుడు ట్వీట్ చేశారు. టికెట్ల కాపీలను కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే టికెట్లు ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు ఖాన్, కొడుకు ఆజాద్ రావు ఖాన్ ముగ్గురి పేరు మీద టికెట్లు బుక్ అయినట్లు ఉంది గానీ.. వాటిని ఎవరు బుక్ చేశారనడానికి మాత్రం అందులో ఎలాంటి ఆధారం లేదు.

కాగా అమీర్ ఖాన్ కు కొంత మంది మాత్రం తమ మద్దతును ప్రకటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అమీర్ కు అండగా నిలిచారు. కాంగ్రెస్ నాయకులు ఎస్ జైపాల్‌రెడ్డి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఆమిర్‌కు మద్దతు పలికారు. తన అభిప్రాయాన్ని వెల్లడించే ప్రజాస్వామిక హక్కు ఆమిర్‌కు ఉందని మమత పేర్కొన్నారు. ఒకరిని దేశం విడిచి వెళ్లాలని కోరే హక్కు ఎవరికీ లేదని, ఈ దేశం అందరిది అని చెప్పారు. కేవలం గోమాంసం తిన్నారన్న నెపంతో హత్యలు చేసే అధికారం ఎవరికీ లేదని ఆమె పరోక్షంగా హిందూత్వ గ్రూపులను విమర్శించారు. తాను నటించిన అనేక సినిమాల్లో దేశభక్తిని చూపే పాత్రలను ఆమిర్ పోషించాడని, తనకు తాను మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం అతనికి లేదని కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. తనపై విమర్శల దాడి జరుగుతున్నా ఆమిర్ ఆచితూచి స్పందించడం ప్రశంసనీయమని మరో బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles