Rahul Gandhi asks students to disagree and they do

Rahul gandhi asks students to disagree and they do

Rahul gandhi, Modi, Swachh Bharat, Make in India, digital India, Rahul Gandhi on Modi, PMO

Congress vice-president Rahul Gandhi’s enthusiasm for empowerment of women and a culture of open dialogue in a democracy got a thumbs-up from second and third-year students at an all-women’s college in Bengaluru Wednesday, but his pessimistic view of the central government’s Swachh Bharat and Make in India campaigns received a blowback.

ITEMVIDEOS: రాహుల్ కు కాలేజీ అమ్మాయిల షాక్

Posted: 11/26/2015 08:20 AM IST
Rahul gandhi asks students to disagree and they do

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. స్వచ్ఛ భారత, మేక్‌ ఇన్‌ ఇండియా బాగున్నాయంటూ కొంతమంది విద్యార్థులు సమాధానమివ్వడంతో ఆయన కంగు తిన్నారు. రాహుల్‌ గాంధీ బెంగళూరు మౌంట్‌కార్మెల్‌ కళాశాల విద్యా ర్థులతో డిబేట్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారు.స్వచ్చభారత అభియానతో దేశంలో మంచి జరిగిందా అని విద్యార్థులను ప్రశ్నించగా అవును.. అవును అంటూ వారు సమాధానమిచ్చారు. మేక్‌ ఇన్ ఇండియాతో ఏమైనా పురోగతి సాధ్యమయిందా? అని ప్రశ్నించగా అవునని జవాబివ్వడంతో రాహుల్‌ ఖంగుతిన్నారు. అనంతరంపలువురు విద్యార్థులు ఇదే అంశాలపై సూటిగా ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో రెండుగంటల పాటు సాగాల్సిన చర్చాగోష్టి అరగంటకు ముందుగానే ముగిసింది. అనంతరం డిబేట్ సంతృప్తినిచ్చిందని రాహుల్‌ అభిప్రాయపడడం గమనార్హం.

దేశం మొత్తం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో నడవాలని ప్రధాని నరేంద్రమోదీ భావిస్తున్నారని, ఈ దేశాన్ని ఆయన మాత్రమే మార్చగలననుకొంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రంలో నిర్ణయాధికారం ఉన్న కొందరు వ్యక్తులు ఉన్నారని, కానీ వారందరినీ బేఖాతరు చేస్తూ ప్రతి నిర్ణయాన్ని ఒకే వ్యక్తి తీసుకుంటున్నారని ఆయన మోదీ పనితీరును తప్పుపట్టారు. ఒకే వ్యక్తి అన్నింటికీ సమాధానం ఇవ్వలేరని, సంప్రదింపులు, చర్చలు అవసరమని చెప్పారు. ప్రతిపక్షంతో ప్రధాని ఎన్నడూ సంభాషించలేదని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రతిపక్షాలను సంప్రదించేవారని, కనీసం ఫోన్‌లోనైనా కాంగ్రెస్ నేతలతో మాట్లాడేందుకు ప్రధాని ఆసక్తి చూపలేదని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Modi  Swachh Bharat  Make in India  digital India  Rahul Gandhi on Modi  PMO  

Other Articles