China wall in snow fall

China wall in snow fall

china, Great China Wall, Snowfall, Winter season

Chinese tourists carefully climb slippery steps as snow is seen on the Great Wall after a snowfall near Beijing, China.

మంచు దుప్పటిలో గ్రేట్ చైనా వాల్

Posted: 11/24/2015 01:17 PM IST
China wall in snow fall

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి గా పేరు పొందిన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోంది. చైనా ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ వాల్ పొడవు 8,851 కిలోమీటర్లుగా తేల్చింది. అయితే ఇప్పుడు ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వైట్ పేయింట్ వేసుకుందట! కానీ మన ఇంటికి పేయింట్ వెయ్యాలంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది కదా మరి అంత పెద్ద చైనా వాల్ కు ఎలా పెయింట్ వేస్తారు అనే అనుమానానికి తావివ్వకండి. ఎందుకంటే ఆ వాల్ కు పెయింట్ వేసింది మనుషులు కాదు.. ప్రకృతి.

ఏంటి గ్రేట్ వాల్ కి… వైట్ పేయింటా అని ఆశ్చర్యపోతున్నారా?బీజింగ్ లో అధికంగా మంచు కురుస్తోంది. దీంతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా పూర్తిగా మంచుతో కప్పుకొనిపోయి… మంచు తొడుగు వేసినట్లుగా, వైట్ పేయింట్ వేసినట్లుగా… ఆకర్షణీయంగా ఉందని అక్కడ పర్యాటకులు అంటున్నారు. సహజ సిద్దంగా ఏర్పడిన ఆ ప్రకృతి అందాన్ని చూసేందుకు సందర్శకులు వస్తున్నారని అధికారులు అంటున్నారు. మీకు కూడా చైనా వాల్ అందాలు అది కూడా అద్భుతమైన మంచు తెర మీద చూడాలనుకుంటే వెంటనే పెట్టాబేలా సర్దుకొని చైనా కు ప్రయాణం కండి. Get Ready.

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  Great China Wall  Snowfall  Winter season  

Other Articles