Belgians tweet cat pictures during BrusselsLockdown

Belgians tweet cat pictures during brusselslockdown

Brazil, terror attack, locksdown, ISIS, ISIS Attack, BrusselsLockdown

The Belgian capital has been on lockdown since Saturday amid a search for suspected Paris attacks gunman Salah Abdeslam. On Twitter, the hashtag #BrusselsLockdown had been the term of choice for people discussing the raids.But on Sunday night, the term was overtaken by Twitter users posting pictures and videos of cats, to make sure that any leaking of operational details were drowned out.

ఆ పిల్లి టెర్రరిస్టులను వేటాడుతోంది

Posted: 11/23/2015 04:43 PM IST
Belgians tweet cat pictures during brusselslockdown

అవును మీరు చదువుతున్నది కరెక్టే.. టెర్రరిస్టులను వేటాడటంలో ఓ పిల్లి చాలా బిజీగా ఉంటోంది. ప్యారిస్ దాడి తర్వాత టెర్రరిస్టులు ఏ క్షణంలో అయినా దాడికి దిగవచ్చునన్న అనుమానంతో చాలా దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అయితే బెల్జియంలో నిన్నటి నుండి టెర్రరిస్టులు దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి పరిస్థితి అసాధారణంగా మారింది. అక్కడి భద్రతా బలగాలు వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. బ్రసెల్స్ లో లాక్ డౌన్ నడుస్తోంది. జనాలు ఇళ్లు వదిలి బయటకు రాకుండా భద్రతా బలగాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. అయితే అసలే నెట్ వాడకానికి బాలా అలవాటు పడ్డ జనం.. ఇంట్లో ఎలా ఊరికే కూర్చోగలరు. కానీ టెర్రరిస్టులు సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుతున్నారని గ్రహించి.. ఓ పిల్లిని వదిలారు.

బ్రసెల్స్ లో తాజాగా పిల్లి హల్ చల్ చేస్తోంది. బ్రసెల్స్ నగరంలోని చాలా ఏరియాల్లో భద్రతా బలగాలు విసృతంగా గాలింపు చేపడుతుండగా.. నెట్ లో ఓ పిల్లిని వదిలారు నెటిజన్లు. బయట ఏం జరుగుతుందో... ఏం జరిగిందో.. మొత్తం పిల్లి ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది టెర్రరిస్టులు పిల్లుల్లాగా గుట్టుచప్పుడు కాకకుండా ఉన్నారని కొంతమంది పోస్టులు పెడితే.. కుక్కల పక్కన నక్కిన పిల్లలా మీరున్నారు అంటూ మరొకరు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు పోస్టులు పెట్టారు. బ్రసెల్స్ లో 200 ఎంపీహెచ్ పిల్లులను టెర్రరిస్టుల వేటకు వాడుతున్నారని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇలా నెట్ లో ప్రస్తుతం #BrusselsLockdown పేరుతో ఓ పిల్లి హల్ చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil  terror attack  locksdown  ISIS  ISIS Attack  BrusselsLockdown  

Other Articles