BJP Senior Leder Yennem Srinivas gave resignation for BJP

Bjp senior leder yennem srinivas gave resignation for bjp

BJP, Telangana, Yennem Srinivas, Yennam Srinivas Resignation, Telangana BJP

BJP Senior Leader and Mahabubnagar former MLA Yennem Srinivas resigned for party membership and all designation from the Party.

బిజెపికి షాక్.. యెన్నెం శ్రీనివాస్ రాజీనామా

Posted: 11/23/2015 03:29 PM IST
Bjp senior leder yennem srinivas gave resignation for bjp

తెలంగాణలో అంతకంతకు పడిపోతున్న బిజెపి గ్రాఫ్ ను మరింత కుదేలు చెయ్యడానికన్నట్లు.. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా.. ఎన్నికల బరితో ఎంతో కీలకంగా వ్యవహరించిన యెన్నెం ఎందుకు పార్టీకి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది అన్న దాని మీద చర్చ సాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మహబూబ్ నగర్ శాసనసభ నియోజక వర్గానికి ఎన్నికలు రావడం.. తర్వాత అక్కడ బిజెపి పార్టీ తరఫున యెన్నెం శ్రీనివాస్ రెడ్డి విజయదుందుభి మోగించడం నాడు సంచలనమే సృష్టించింది. కానీ తాజాగా ఆయన రాజీనామా అందరికి ఆశ్చర్యాన్ని కలగిస్తోంది.

మహబూబ్ నగర్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి....బీజేపీకీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. తెలంగాణ లక్ష్యాలు, గమ్యాలు దూరమవుతున్నాయన్న యెన్నం... వాటిని సాధించుకునేందుకు ఉద్యమం చేపడతానన్నారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదన్న ఆయన.. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేస్తానని చెప్పారు. నాగం జనార్దన్రెడ్డితోపాటు మరికొందరు కలిసివస్తారని అన్నారు. ఉద్యమకారులను ఇప్పటివరకు సత్కరించుకోలేక పోయామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ లో బడుగుల తెలంగాణ కోసం కృషి చేస్తానని... ప్రజలకు మంచి చేసేందుకు యువత కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Telangana  Yennem Srinivas  Yennam Srinivas Resignation  Telangana BJP  

Other Articles