The Woodpecker Gangi reddy arrested

The woodpecker gangi reddy arrested

gangi Reddy, The 'Woodpecker, AP, Red Sandal, Smuggler, Sheshachalam forest, Red sandal smuggler, Chandrababu Naidu on gangi reddy, Gangi Reddy arrested

"My luck has run out and I am caught" -- was how the 'most wanted' red sanders smuggler Kollam Gangi Reddy reacted when he spoke to the media here on Sunday, hours after his extradition from Mauritius. However, Lady Luck has always sided with once petty offender Gangi Reddy, catapulting him from the proverbial rags to great riches. And when the 'Lady' finally stopped smiling, Gangi Reddy, by then a notorious international smuggler, found himself behind bars. Gangi Reddy is a prized catch and both police and forest officials hope that his arrest will put an end to international smuggling of red sanders.

ఏపి వీరప్పన్ అరెస్ట్.. ఇక స్మగ్లింగ్ పై ఉక్కుపాదం

Posted: 11/16/2015 08:39 AM IST
The woodpecker gangi reddy arrested

ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని పట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు విజయం సాధించారు. విదేశాలకు పారిపోయిన వారిని గుర్తించడంలో ఏళ్లతరబడి జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎనిమిది నెలల వ్యవధిలో ఏపీ సీఐడీ పోలీసులు గంగిరెడ్డిని అరెస్ట్‌ చేయడం విశేషం. గంగిరెడ్డిని ఆరునెలలలోనే అరెస్ట్‌ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ గంగిరెడ్డి న్యాయపరమైన చిక్కులు సృష్టించి తప్పించుకునే వారు అయినప్పటికీ సీఐడీ పోలీసులు అత్యంత చాకచక్యంగా గంగిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. గంగిరె డ్డిని అప్పగించడంలో మారిషస్‌ పోలీసులు తమకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించారని ఏపి డిజిపి రాముడు పేర్కొన్నారు. నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి పారిపోయాడని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గంగిరెడ్డిపై 28 పోలీసు కేసులు ఉన్నాయన్నారు. గంగిరెడ్డి అక్రమాస్తులు ఎంత ఉన్నాయన్న అంశంపై అది మా పరిధి కాదంటూనే 300 నుంచి 400 కోట్ల వరకూ ఉండవచ్చునని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా కేవలం గంగిరెడ్డిపైనే ఫోకస్‌ చేసి మిగతా వారిని ఎందుకు వదిలేస్తున్నారంటూ మీడియా సమావేశంలో డీజీపీని విలేకరులు ప్రశ్నించిన సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడేవారిని ఎవర్నీ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్‌ సాహుల్‌ లొంగిపోతాడన్న సమాచారంపై మీడియా డీజీపీని ప్రశ్నించగా దానిని ఖండించలేమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు, నలుగురు తప్పితే ప్రధాన స్మగ్లర్లు లేరని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఎర్రచందనం స్మగ్లింగ్‌కి అడ్డుకట్ట ఎందుకు పడడం లేదని మీడియా ప్రశ్నకు డీజీపీ రాముడు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రధాన వ్యక్తులు పోయినా వారి తాలూకా వ్యక్తులు ఇంకా ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. ఎర్రచందనం అక్ర మ రవాణాను పూర్తిగా అరికట్టే విధంగా పకడ్బందీ చర్యల్లో భాగంగా సాంకేతికతను వినియోగించుకోగలమని డీజీపీ రాముడు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles