sachin, ganguly hits half centuries in all stars

Sachin blasters sets 220 runs target for warriors

sachin tendulkar, sourav ganguly, Warne Warriors, Sachin Blasters, All Stars T20, final match, Sachin's Blasters vs Warne's Warriors,Live Streaming Information,Cricket all stars,Watch live,Cricket all stars live,Sachin's blasters vs warne's warriors live,Sachin's blasters team,Cricket all stars team,Sachin's blasters vs warne's warriors live stream,Cricket all stars tv channel,Sachin's blasters vs warne's warriors tv coverage

Sachin Blasters will look for a consolation win in the third and final T20 against Warne Warriors after losing the first two T20s in Los Angeles in the first edition

చెలరేగిన సచిన్, సౌరవ్.. పరువు నిలబెట్టుకుంటారా..? లేదా..?

Posted: 11/15/2015 10:52 AM IST
Sachin blasters sets 220 runs target for warriors

ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్ లో సిరీస్ ఓటమిని చవిచూసినా.. చివరగా వున్న ఒకే ఒక్క మ్యాచ్ లోనైనా రాణించాలని సచిన్ బ్లాస్టర్ జట్టు కసిగా వుంది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన చివరి టీ-20లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ చెలరేగారు. వార్న్ వారియర్స్ తో జరుగుతున్న మూడో మ్యాచ్ లో అర్ధసెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

తమ ప్రత్యర్థి వార్న్ వారియర్స్ ముందు 220 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సచిన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు సాధించాడు. గంగూలీ 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. సెహ్వాగ్ 27, జయవర్ధనే 41, హూపర్ 33 పరుగులు సాధించారు. వారియర్స్ బౌలర్లలో వెటోరి 3 వికెట్లు పడగొట్టాడు. సైమండ్స్, వాల్ష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.  మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో వారియర్స్ గెలిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  sourav ganguly  Warne Warriors  Sachin Blasters  All Stars T20  final match  

Other Articles