Paris Terror Attack Very Similar to Mumbai attack

Paris terror attack very similar to mumbai attack

Paris Terror Attack, Mumbai Terror Attacks, 26/11 Mumbai Terror Attacks, US Security Experts, France Terror Attack, Paris Mumbai Terror Attacks Similar, Paris Attack Copycat of Mumbai Terror Attacks

The horrific terrorist attack in Paris has been described as the 'copycat' version of the 2008 Mumbai terror attack by security experts in United States, who believe that the incident will be a game changer for how the West looks at the threat terrorism presents to all. Over 120 people were killed as terrorists attacked sites throughout the French capital and at the stadium where the soccer match was underway.

ముంబై తరహాలోనే ప్యారిస్ దాడి

Posted: 11/14/2015 01:17 PM IST
Paris terror attack very similar to mumbai attack

భారత్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండను ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది తాజ్ మహల్ హోటల్. ముంబైలో రక్తపాతాన్ని సృష్టించిన ఉగ్రవాదులు వందల మంది అమాయకులు ప్రాణాలను బలిగొన్నారు. వేల మంది కుటుంబాలకు తీరని అన్యాయం చేశారు. ముంబై ఘటనను గుర్తు చేసుకుంటే చాలా మంది బాధితులు ఇప్పటికీ కంట్లో కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే అదే తరహాలో తాజాగా ప్యారిస్ లో దాడి జరిగింది. అమెరికా  సైనిక నిపుణులు ప్యారిస్ దాడి కూడా ముంబై 26/11 దాడిలాగే ఉందని.. రెండింటికి పోలిక ఉందని అంటున్నారు. సముద్ర మార్గం ద్వారా వచ్చిన ఉగ్రవాదులు ముంబై నగరాన్ని ఎలా అయితే రక్తంతో నింపేశారో అలాగే ప్యారిస్ లో కూడా జరిగింది.

Also Read: ప్యారిస్ లో ఉగ్రపంజా.. 140 మంది మృతి

ముంబై దాడులకు, ప్యారిస్ దాడులకు పోలీక ఉంది అని సీనియర్ సైనికాధికారి వెల్లడించారు. గతంలో ముంబై మీద దాడికి ఉగ్రవాదులు చాలా ప్లాన్డ్ గా వెళ్లారని.. టీంలుగా విడిపోయి.. నగరంలోని వేరువేరు ప్రదేశాల్లో దాడులకు తెగపడ్డారు. అచ్చం అలాగే ప్యారిస్ లో కూడా వేరు వేరు ప్రాంతాల్లో ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ముంబైలో తాజ్ హోటల్ ను టార్గెట్ గా చేసిన ఉగ్రవాదులు.. ప్యారిస్ లో ఓ స్టేడియంను టార్గెట్ గా చేసుకొని విరుచుకుపడ్డారు. అందుకే అక్కడున్న సైనికాధికారులు ప్యారిస్ దాడిని ముంబై దాడితో పోలుస్తూ.. విచారణను ప్రారంభించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles