Modi condemns attacks in France

Pm narendra modi condemns deadly terrorist attacks in france

modi, Modi tweet on Paris Attack, Modi condemn, paris, France, Terror, Attack, paris Attack, explosions in paris, shootings in Paris

Prime Minister Narendra Modi condemned the deadly terrorist attacks in Paris that has killed at least 100 people, saying that the “news from Paris is anguishing and dreadful”. “News from Paris is anguishing & dreadful. Prayers with families of the deceased. We are united with people of France in this tragic hour,” Modi tweeted soon after the attacks.

పారిస్ దాడిపై మోదీ దిగ్భ్రాంతి.. మండిపడ్డ ఒబామా

Posted: 11/14/2015 08:08 AM IST
Pm narendra modi condemns deadly terrorist attacks in france

పారిస్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడులు తనను దిగ్ర్భాంతికి గురిచేశాయని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదనగా చెప్పారు. కష్టకాలంలో తాము ఫ్రాన్సు దేశానికి అండగా ఉంటామని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు సాగించిన నరమేధాన్ని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. పారిస్‌లో జరిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను అమెరికా అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా ఖండించారు. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఐక్యరాజ్యస‌మితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు.

పారిస్ పేలుళ్లు, కాల్పుల ఘటన అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ప‌రిస్థితిని స‌మీక్షించారు.. నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా హొలాండ్ తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. పారిస్ న‌గ‌రంపై ఉగ్ర‌వాదుల దాడి నేప‌థ్యంలో ఫ్రాన్స్ అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున వేట ప్రారంభించింది. 15వంద‌ల మందికి పైగా పోలీసులు ఉగ్రవేట‌లో నిమ‌గ్నమై ఉన్నారు. పారిస్ న‌గ‌రంలో న‌ర‌మేథం సృష్టించిన దాడిలో ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఫ్రాన్స్‌లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను విధించింది. పారిస్‌లో ఉగ్రవాదులు భారీ పేలుళ్లు జరపడంతో అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. ఉగ్రవాదుల కోసం గాలింపు కోసం 1500 మంది సైన్యం రంగంలోకి దిగారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles