Pawan Kalyan spoke for Tribals

Pawan kalyan spoke for tribals

Pawan Kalyan, Tribals, bauxite, AP, Pawan Kalyan, Pawan kalyan meet Chandrababu, AP, Land pooling, Amaravati, Chandrababu Naidu, Janasena, Janasena Party, Pawan kalyan on AP Issues

After farmers Janasena party President Pawan kalyan spoke about Tribals. AP Goovt gave permmission to bauxite. He requested to protect Trbals.

నాడు రైతులు.. నేడు గిరిజనుల కోసం పవన్

Posted: 11/12/2015 03:44 PM IST
Pawan kalyan spoke for tribals

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజాపక్షం నిలిచారు. నాడు ఏపి రాజధాని అమరావతి నిర్మాణం కోసం అంటూ రైతుల నుండి ఏపి ప్రభుత్వం ప్రయత్నించింది. దాదాపు 33 వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం మిగిలిన కొన్ని ఎకరాల భూమిని సేకరించేందుకు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ను తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు. కానీ రైతులు తమ భూములను లాక్కోవడాన్ని వ్యతిరేకించగల నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్మారు. అందుకే పవన్ కళ్యాణ్ మా కోసం రావాలి.. పోరాటం చెయ్యాలని డిమాండ్ చేశారు. చివరకు రైతుల కోసం పవన్ బరిలోకి దిగి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ను అడ్డుకున్నారు. గతంలో రైతుల కోసం పోరాటం చేసిన పవన్ మరోసారి ప్రజల కోసం గళమెత్తారు.

Also Read: నయా ట్రెండ్: పంచెకట్టులో పవన్ 

బయటి ప్రపంచంతో సంబందం లేకుండా తమ జీవితాలను తాము బతికేస్తున్న గిరిజనుల కోసం పవన్ ప్రతిఘటన మొదలుపెట్టారు. బాక్సైట్ తవ్వకాల పేరుతో గిరిజనులను చెల్లాచెదురు చేసి వారి జీవితాలను ఛిద్రం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పవన్ వ్యతిరేకించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తు... గిరిజనుల జీవితాలను ఛిద్రం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని పవన్ వెల్లడించారు. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ గిరిజనుల పై చర్చించారు. గిరిజనులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని చంద్రబాబును కోరారు. దానికి చంద్రబాబు నుండి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు పవన్ వెల్లడించారు.

Also Read: పవన్ కళ్యాణ్ కు మీడియా కవరేజ్ ఎందుకు..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bauxite  Tribals  Pawan kalyan  Chandrababu Naidu  

Other Articles