Indian railways presenting new rules in reservation tickets | indian railways | railway ticket reservations

Indian railway department introducing new rules in reservation tickets

indian railways, railway ticket reservations, railway travelers, railway journeys, indian travelers, indian railways new rules

indian railway department introducing new rules in reservation tickets : Indian railway department introducing new rules for tickets reservations. Travelers can reserve their tickets before half an hour train journey.

రైల్వే ప్రయాణికులకు గుడ్, బ్యాడ్ న్యూస్

Posted: 11/12/2015 10:36 AM IST
Indian railway department introducing new rules in reservation tickets

రైల్వే ప్రయాణికులకు ఒకేసారి గుడ్, బ్యాడ్ వార్తల్ని ముందుకు తీసుకొచ్చింది రైల్వేశాఖ. ప్రయాణికుల జర్నీ విషయంలో ఆ శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. గుడ్ న్యూస్ ఏమిటంటే.. రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని రైల్వేశాఖ అమల్లోకి తీసుకొచ్చింది.

రైలు బయలుదేరడానికి కొన్ని నిముషాల ముందు కొందరు తమ రిజర్వేషన్లను రద్దు చేస్తుంటారు. దాంతో బెర్తులు ఖాళీగా వుండిపోతున్నాయి. అలా ఖాళీగా వదిలేయడం కంటే వాటిని కూడా భర్తీ చేస్తే ఆదాయం బాగా వుంటుందని చాలా ఆలస్యంగా పసిగట్టిన అధికారులు.. ‘30 నిముషాల ముందు రిజర్వేషన్’ అనే ప్రణాళికను తీసుకొచ్చింది. దీంతో.. అందుబాటులో వున్న సీట్ల ఆధారంగా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నమాట. ఈ నేపథ్యంలో రైలు బయలుదేరడానికి ముందు ఇప్పటివరకు ఒకసారే చార్ట్ ప్రిపేర్ చేసే అధికారులు.. లేటెస్ట్ రూల్స్ ప్రకారం రెండుసార్లు సిద్ధం చేయాల్సివుంటుంది. రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు తొలిఛార్జ్‌ను రెడీ చేస్తారు. అప్పటికీ ఆ రైల్లో బెర్తులు ఖాళీగావుంటే ఆ తర్వాత ప్రయాణికులు ఇంటర్నెట్ ద్వారా గానీ, రిజర్వేషన్ కౌంటర్ల నుంచి టికెట్లు తీసుకోవచ్చు. రైలు బయలుదేరే అరగంట ముందు టీటీఈలకు కొత్తచార్ట్‌ను అందజేస్తారు. ఈ సదుపాయం వల్ల బెర్తుల్ని వినియోగించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నది అధికారుల ప్లాన్. దీనివల్ల దళారులను తగ్గించవచ్చునని భావిస్తున్నారు.

ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. టికెట్ క్యాన్సిల్లోనూ కొత్త రూల్స్ రానున్నాయి. ప్రస్తుతం అమలులోవున్న నిబంధనల ప్రకారం.. టిక్కెట్ కొన్నాక రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు రద్దు చేసుకుంటే రిజర్వేషన్ ఛార్జీలే కోల్పోవాల్సి వుండేది. అదే 6 గంటల ముందు వరకైతే 25 శాతం టిక్కెట్ డబ్బులు లాస్ అవుతారు. 2 గంటల ముందు అంటే టిక్కెట్ ధరలో 50శాతం వదులుకోవాల్సిందే! కానీ.. కొత్త రూల్స్ ప్రకారం.. ఈ ఛార్జీలు రెట్టింపు కానున్నాయి. రైలు బయలుదేరాక కొన్న టిక్కెట్ క్యాన్సిల్ అయితే ఇక డబ్బులు పూర్తిగా వదులుకోవడమే! ఈ కొత్త నిబంధనలు నేటి (గురువారం (12-11-2015)) నుంచి అమలులోకి రానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian railways  railway ticket reservation  

Other Articles